Aarogyasri : ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్..! రూ. 100కోట్లు విడుదల చేసినా.. వెనక్కి తగ్గని టీఏఎన్‌హెచ్ఏ
Aarogyasri : తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోషియేషన్ (టీఏఎన్‌హెచ్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

Aarogyasri
Aarogyasri : తెలంగాణలో ఆరోగ్య శ్రీ సేవలకు బ్రేక్ పడనుంది. తెలంగాణ ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోషియేషన్ (టీఏఎన్‌హెచ్ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేటి అర్ధరాత్రి (16వ తేదీ) నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 330 ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నాయి.
Also Read: Hyderabad Metro : బాబోయ్.. ఇలా అయితే కష్టం.. హైదరాబాద్ మెట్రోను మేం నడపలేం.. మీరు కొనుగోలు చేయండి..!
12 నెలల నుంచి రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించలేదని, 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హాస్పిటల్స్ నడిపించే పరిస్థితి లేదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
ఇదిలాఉంటే.. సోమవారం ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.100 కోట్లు విడుదల చేసినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే, నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం ఆరోగ్యశ్రీ సేవల బంద్ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్లు కనిపించడం లేదు. మొత్తం రూ.1400కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని.. మొత్తం క్లియర్ చేయాలని టీఏఎన్‌హెచ్ఏ ప్రభుత్వాన్ని కోరింది.