కరోనా అనుమానితుల ఇళ్ల ముందు రెడ్ నోటీసులు

రోజురోజుకి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోండటంతో.. బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటించింది. సీఎం కేసీఆర్ విదేశాల నుంచి వస్తున్న వాళ్లు తప్పకుండా హోం క్వారంటైన్‌లో ఉండాలన్నారు. అధికారులు హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి నిన్నటి (మార్చి 24, 2020) నుంచి రెడ్ నోటిసులు జారీ చేశారు. అంతేకాదు కుటుంబసభ్యుల అనుమతితో వారి ఇంటికి రాకూడదు అని రాసి ఓ నోటీసు ఇంటిముందు అంటిస్తున్నారు.
అలాగే తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39కి చేరుకోవటంతో. ఇంటింటికీ తిరిగి విదేశాల నుంచి వచ్చినవారి ఇళ్లకి క్వారంటైన్ ముద్రలు వేశారు. ఇకపోతే ఇటలీ, ఇండోనేషియా, అమెరికా, దుబాయ్ నుంచి వచ్చినవారు వేలసంఖ్యలో ఉన్నారని సమాచారం. 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతుందటంతో అధికారులు వారిపై పెద్ద నిఘా వేశారు.
మంగళవారం విదేశాల నుంచి వచ్చిన ముగ్గురికి, లోకల్ కాంటాక్ట్ ద్వారా మరో ముగ్గురికి వైరస్ సోకింది. దీంతో ఒక్కరోజులోనే బాధితుల సంఖ్య 33 నుంచి 39కి పెరిగింది. ఇక నుంచి ప్రజలంతా ఏ అవసరం ఉన్నా డయల్ 100కు కాల్ చేయాలని KCR సూచించారు. అపెండిక్స్, గుండె జబ్బు తదితర ప్రాణాపాయ పరిస్థితి ఎదురైనా, ఎవరైనా కావాల్సిన వారు మరణించినా 100 నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు. అలాంటి ప్రత్యేక కారణాలు ఉన్నవారికి పోలీసులు సహకరిస్తారని.. సొంత వాహనాలు లేకపోతే వాహన సదుపాయం కూడా కల్పిస్తారని హామీ ఇచ్చారు.
See Also | వాట్సప్ లో కరోనా పై తప్పుడు ప్రచారం : ఇద్దరి అరెస్ట్