Remdesivir Black Market : రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపు..కరోనా పేషెంట్లు తీవ్ర అవస్థలు

హైదరాబాద్‌లో రెమిడెసివిర్‌ బ్లాక్‌ దందా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫార్మా కంపెనీల సిబ్బందే.. ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుండటంతో.. జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

Remdesivir Black Market : రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌ మార్కెట్‌కు తరలింపు..కరోనా పేషెంట్లు తీవ్ర అవస్థలు

Remdesivir Black Market

Updated On : April 20, 2021 / 12:01 PM IST

Remdesivir injections : హైదరాబాద్‌లో రెమిడెసివిర్‌ బ్లాక్‌ దందా కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఫార్మా కంపెనీల సిబ్బందే.. ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తుండటంతో.. జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. కూకట్‌పల్లిలోని హెటిరో కంపెనీ ఔట్‌లెట్‌ వద్ద రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల కోసం కరోనా పేషెంట్ల బంధువులు బారులు తీరినా.. వారందరినీ పక్కనపెట్టి హెటిరో సిబ్బంది ఇంజక్షన్లను బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

ఇదేంటని ప్రశ్నించిన స్థానికులపై బ్లాక్‌ దందా కేటుగాళ్లు ఎదురుదాడి చేస్తున్నారు. కూకట్‌పల్లిలోని హెటిరో ఫార్మా కంపెనీ ఔట్‌లెట్‌ నుంచి రెమిడెసివిర్‌ను తీసుకెళ్తున్న పలువురిని స్థానికులు అడ్డుకున్నారు.

ఇప్పటికే కూకట్ పల్లి లోని హెటిరో కంపెనీ కి చెందిన ఒక ఔట్లెట్ ని పెట్టి జనాలకు రేమిడిస్వేర్ అమ్ముతున్నారు. అయితే అందులో పని చేసే కొందరు సిబ్బంది మందులను లైన్ లో వేచి ఉన్న వారికి ఇవ్వకుండా వారిముందు నుంచే బ్లాక్ లో కొంతమంది కేటుగాళ్లకు అమ్మకానికి తీసుకెళ్తుంటే అక్కడే ఉన్న వారు పట్టుకున్నారు.