Congress : కాంగ్రెస్ కు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా మద్దతు

ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లుగా అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలన్నారు.

Congress : కాంగ్రెస్ కు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా మద్దతు

Republican Party of India support Congress

Updated On : November 15, 2023 / 4:11 PM IST

Republican Party of India Support Congress : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రిపబ్లికన్ పార్టీ అఫ్ ఇండియా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలే నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఏ సర్వే చూసినా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారని పేర్కొన్నారు.

తొమ్మిదేళ్లుగా అరాచక పాలన చేసిన బీఆర్ఎస్ గద్దె దిగిపోవాలన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతుందన్నారు. ఈశ్వరి భాయ్ పెట్టిన పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ కాంగ్రెస్ తోనే సాధ్యమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ కి బేషరతుగా మద్దతు తెలిపిందన్నారు.

Revanth Reddy : కేసీఆర్ అలాచేస్తే కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో అవసరం అన్నారు. నిజమైన కాంగ్రెస్ వాది వి.హనుమంతరావు అని కొనియాడారు. అయన స్టార్ కంపెయినర్ గా ఉన్నారని తెలిపారు. నవంబర్ 17వ తేదీ నుండి వి.హనుమంతరావు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి : మహేష్ బాబు
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఏకగ్రీవంగా కాంగ్రెస్ కి మద్దతు తెలుపుతుందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మహేష్ బాబు పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రారంభించారని తెలిపారు. ఈశ్వరిభాయ్ పటేల్ పార్టీని ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చారని వెల్లడించారు. ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా ఏంటో సేవ చేశారని తెలిపారు. ఇందిరా గాంధీ హయాంలోనే దేశాభివృద్ధి జరిగిందన్నారు.

Revanth Reddy : కేసీఆర్ అలాచేస్తే కొడంగల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో పోటీ నుంచి తప్పుకుంటా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఉద్యోగ కల్పన, భూ సంస్కరణలు, పారిశ్రామిక వృద్ధి, ఇళ్ల నిర్మాణం, భూపంపిణి వంటివి ఇందిరా హయాంలోనే జరిగాయని తెలిపారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ స్కిమ్స్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనున్నాయని చెప్పారు. మహాలక్ష్మి ద్వారా రూ.2500 ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.