Revanth to Delhi: ఢిల్లీకి రేవంత్.. మరింత ఉత్కంఠ పెంచుతోన్న సీఎం ఎంపిక

రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఢిల్లీ పెద్దలకు వారు వివరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ముఖ్యమంత్రి పదవిపై పోటీ కొనసాగుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని సీనియర్లు అధిష్టానానికి చెప్తున్నారట.

Revanth to Delhi: ఢిల్లీకి రేవంత్.. మరింత ఉత్కంఠ పెంచుతోన్న సీఎం ఎంపిక

Updated On : December 5, 2023 / 6:21 PM IST

అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఢిల్లీకి రేవంత్ రెడ్డి బయల్దేరారు. శంశాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో డీకే శివకుమార్, మాణిక్యం ఠాకూర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఢిల్లీ పెద్దలకు వారు వివరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ముఖ్యమంత్రి పదవిపై పోటీ కొనసాగుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని సీనియర్లు అధిష్టానానికి చెప్తున్నారట.