New Ration Cards : కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఎప్పటి నుంచి అంటే..
ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం.

New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రభుత్వం శుభవార్త తెలిపింది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండలిలో వెల్లడించారు. ఈసారి జారీ చేసే రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలో ఉండనున్నాయని ఆయన తెలిపారు. అలాగే రేషన్ కార్డులో చిప్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ చిప్ లో కుటుంబసభ్యుల పూర్తి వివరాలను పొందుపొరుస్తామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ సమయంలో ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యాన్ని అందజేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
‘ఈసారికి కార్డులు జారీ చేసినప్పుడు అదనపు కార్డులు ఇవ్వడమే కాకుండా స్మార్ట్ కార్డులు ఇస్తాం. అందులో మైక్రో చిప్ ఉంటుంది. అందులో కుటుంబసభ్యుల పూర్తి సమాచారం ఉంటుంది. రేషన్ కార్డు పొందేందుకు ఇప్పుడు ఏయే అర్హతలు ఉన్నాయో రాబోయే రోజుల్లోనూ వాటినే కొనసాగిస్తాం. ఎలక్ట్రానిక్ చిప్ తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తాం. తెలంగాణలోని కుటుంబాలకు ఈ విషయం చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెడతాం. అదే విధంగా ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Also Read : లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అమెరికా వెళ్లనున్న కేసీఆర్.. రెండు నెలలు అక్కడే ఉండేందుకు ప్లాన్