Revanth Oath Ceremony: భారీ జనసందోహంతో బయల్దేరిన రేవంత్
కాంగ్రెస్ ఎంపీ.. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోనున్న రేవంత్ ప్రజా సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ర్యాలీగా కదలి వెళ్లారు.

Rvnth
Revanth Oath Ceremony: కాంగ్రెస్ ఎంపీ.. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు అందుకోనున్న రేవంత్ ప్రజా సమక్షంలో భారీ ర్యాలీ చేపట్టారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ర్యాలీగా కదలి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట 30నిమిషాలకు నాంపల్లిలోని గాంధీ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తదుపరి గాంధీభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
[svt-event title=”ట్యాంక్ బండ్ వద్ద గజమాలతో” date=”07/07/2021,12:58PM” class=”svt-cd-green” ] భారీ ర్యాలీలో ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకున్న తమ అభిమాన నేత రేవంత్‌కు గజమాల సమర్పించి అభినందనలు తెలిపారు అభిమానులు. భారీగా జనం తరలిరావడంతో రోడ్డు కిక్కిరిసిపోయింది. [/svt-event]
[svt-event title=”సీతక్కతో పాటు పలువురు” date=”07/07/2021,12:49PM” class=”svt-cd-green” ] రేవంత్ ర్యాలీకి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చాయి. రేవంత్ వెంట ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. [/svt-event]
[svt-event title=”అభివాదాలు.. అభినందనలతో” date=”07/07/2021,12:30PM” class=”svt-cd-green” ] రేవంత్ అభిమానులు, భారీగా తరలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి గాంధీభవన్‌కు రేవంత్ ర్యాలీగా బయల్దేరారు. టపాసులతో, అభిమానుల స్వాగతాలతో వెళ్లే దారిలో తెలియజేస్తున్న అభినందనలను స్వీకరిస్తూ ముందుకు వెళుతున్నారు. [/svt-event]
[svt-event title=”వేద పండితుల సమక్షంలో” date=”07/07/2021,12:15PM” class=”svt-cd-green” ] పెద్దమ్మ గుడిలో వేద పండితుల సమక్షంలో జరిగిన ప్రత్యేక పూజలకు హాజరయ్యారు. తన నివాసానికి భారీ సంఖ్యలో కాంగ్రెస్ నేతలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. [/svt-event]