Revanth Reddy: రంగురంగుల వీడియోల బదులు..! ఎమ్మెల్సీ కవితకు రేవంత్ కౌంటర్.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

హైదరాబాద్ లో నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరం అన్నారు. ఇది ఆత్మహత్య గా మాత్రమే చూడొద్దు.. నిరుద్యోగ యువత కలలు ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్లు ఉందని అన్నారు.

Revanth Reddy: రంగురంగుల వీడియోల బదులు..! ఎమ్మెల్సీ కవితకు రేవంత్ కౌంటర్.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?

Rahul Gandhi, Revanth and Kavitha

Updated On : October 14, 2023 / 1:37 PM IST

Revanth Reddy Counter To MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు… గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా అంటూ రేవంత్ ప్రశ్నించారు. ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప.. పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ నగర్ లో ఆత్మహత్య చేసుకున్న ఆడబిడ్డ ప్రవల్లిక తరపున న్యాయం కావాలని వేల గొంతులు నినదిస్తున్నా, కేసీఆర్ చెవికి వినబడటం లేదని రేవంత్ అన్నారు.

Read Also : MLC Kavitha Bathukamma Song: ఎమ్మెల్సీ కవిత పాడిన బతుకమ్మ పాట విన్నారా? వీడియో వైరల్

ఈ పెద్దమనిషి పాలనలో మనుషుల ప్రాణాలకు విలువ లేదు. రాక్షస పాలనలో హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు తప్ప యువతకు భవిత లేదు. ప్రవల్లిక సూసైడ్ లెటర్ ను గమనిస్తే ఇదే అర్థమవుతోందని రేవంత్ అన్నారు. విద్యార్థిని ఆత్మహత్య పై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

 

 

Read Also : KTR : కాంగ్రెస్‌లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం కుదిరింది..పదవీ కాలాన్ని పంచేసుకున్నారు : కేటీఆర్

ఇదిలాఉంటే శుక్రవారం హైదరాబాద్ లో నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్యపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరం అన్నారు. ఇది ఆత్మహత్య గా మాత్రమే చూడొద్దు.. నిరుద్యోగ యువత కలలు ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్లు ఉందని అన్నారు. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. నిరుద్యోగ యువత ఆశలను నిలబెడుతుందని రాహుల్ ట్వీట్ చేశారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కూడా నిర్వహిస్తాం. ఒక్క ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇది మా గ్యారెంటీ అంటూ రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు.