Revanth Reddy: అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాను: సీఎం రేవంత్‌ రెడ్డి

"మేము ఇద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం" అని కూడా రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy: అందుకే కేసీఆర్‌కు షేక్‌హ్యాండ్‌ ఇచ్చాను: సీఎం రేవంత్‌ రెడ్డి

Updated On : December 29, 2025 / 1:43 PM IST

Revanth Reddy: తెలంగాణ శాసనసభలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను ఎందుకు షేక్‌హ్యాండ్‌ ఇచ్చానన్న విషయంపై సీఎం రేవంత్‌ రెడ్డి స్పందించారు. లాబీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. “ప్రతి సభ్యుడిని మేము గౌరవిస్తాం. ఈ రోజే కాదు.. ఆసుపత్రిలో కూడా కేసీఆర్‌ను కలిశాను. మేము ఇద్దరం మాట్లాడుకున్నది మీకెలా చెబుతాం. కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా పలకరించాను.

Also Read: కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడంపై కేటీఆర్ కామెంట్స్‌.. ఇది చాలంటూనే..

కేసీఆర్ వెంటనే ఇంటికి ఎందుకు వెళ్లారన్న విషయాన్ని ఆయననే అడగాలి. పార్లమెంట్ సెంట్రల్ హాల్ మాదిరి ఇక్కడ సెంట్రల్ హాల్ ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ యాక్సెస్ ఉంటుంది. మాజీ ఎమ్మెల్యేలకు కూడా సెంట్రల్ హాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం” అని తెలిపారు.

కాగా, తెలంగాణ మంత్రులతో రేవంత్‌ రెడ్డి సమావేశం నిర్వహించి మాట్లాడారు. నీటివాటాల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్‌గా ఉండాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికిని కాపాడుకునే క్రమంలో ఉందని విమర్శించారు. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడానికి మంత్రులు సిద్ధంగా ఉండాలని సూచించారు.

Also Read: కేసీఆర్‌కు రేవంత్‌ రెడ్డి షేక్‌హ్యాండ్‌ ఇవ్వడంపై కేటీఆర్ కామెంట్స్‌.. ఇది చాలంటూనే..