Hyderabad : ఔటర్‌పై ఘోరరోడ్డు ప్రమాదం

ఔటర్ రింగ్‌రోడ్‌పై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఔటర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

Hyderabad : ఔటర్‌పై ఘోరరోడ్డు ప్రమాదం

Hyderabad (4)

Updated On : November 21, 2021 / 11:25 AM IST

Hyderabad : ఔటర్ రింగ్‌రోడ్‌పై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఔటర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శంషాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా పెద్ద అంబర్ పేట్ వెళ్తున్న సమయంలో ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొంది ఓ ట్రక్. ఈ ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ తోపాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. క్లినర్ లారీలో ఇరుక్కుపోయాడు.

చదవండి : Road Accident : ఔటర్‌పై ఘోర ప్రమాదం.. ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు

స్థానికులు 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నాలుగు గంటలు శ్రమించి క్లినర్‌ని లారీ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మృతులను పోస్టుమార్టం నిమ్మితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇక గాయపడిన క్లినర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో గాయాలు కావడం వలన రక్తం చాలా వరకు పోయిందని వైద్యులు తెలిపారు.

చదవండి : Road Accident : సూరారంలో తప్పిన పెనుప్రమాదం

ఇక ఇదిలా ఉంటే శనివారం ఔటర్‌పై ఎనిమిదికార్లు వరుసగా ఢీకొన్నాయి. ఓ లారీ సడెన్‌గా రోడ్డుపైకి రావడంతో కారులో వేగంగా వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా బ్రేక్ వేశారు. దీంతో వరుసగా ఎనిమిది కార్లు ఒకదానివెనుక ఒకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. సమాచారం అందటంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కార్లను పక్కకు తీశారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు.