Road Accident : ఔటర్‌పై ఘోర ప్రమాదం.. ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు

రోడ్డుపై ఉన్న లారీని తప్పించే క్రమంలో కారును సడన్‌గా ఆపాడు డ్రైవర్.. దీంతో దాని వెనకాల ఉన్న ఎనిమిది కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.

Road Accident : ఔటర్‌పై ఘోర ప్రమాదం.. ఒక‌దానికొక‌టి ఢీకొన్న 8 కార్లు

Road Accident (3)

Updated On : November 20, 2021 / 11:25 AM IST

Road Accident : హైదరాబాద్ శివారు.. పెద్దఅంబర్‌పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడున్న పెట్రోల్ బంక్ సమీపంలో లారీ రోడ్డుకు అడ్డంగా రావడంతో వేగంగా వెళ్తున్న కారు సడన్ బ్రేక్ కొట్టింది. దీంతో దానివెనుక వచ్చిన ఏడు కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి.

చదవండి : Road Accident : సూరారంలో తప్పిన పెనుప్రమాదం

వర్షం కురవడంతో కార్లు స్కిడ్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు ఎనిమిదికార్లు మాత్రం దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వాహనాలను పక్కకు తీశారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ప్రమాదానికి లారీడ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.

చదవండి : Fire Accident : మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం-వ్యక్తి మృతి