కవితకు మరోసారి షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి షాకిచ్చింది. తీహార్ జైలులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో ..

కవితకు మరోసారి షాకిచ్చిన రౌస్ అవెన్యూ కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

MLC Kavitha

Updated On : June 3, 2024 / 3:18 PM IST

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి షాకిచ్చింది. తీహార్ జైలులో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సోమవారం ఈడీ అధికారులు కవితను కోర్టులో ప్రవేశపెట్టారు. కవిత కస్టడీపై విచారణ చేపట్టిన జడ్జి కావేరి భవేజా కస్టడీ జూలై 3వ తేదీ వరకు పొడగించారు. మార్చి 26వ తేదీ నుంచి ఆమె తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో కోర్టు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడంతో కవితను తిరిగి తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపుపై ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు విచారణ జరగనుంది. కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీబీఐ కేసులో తీహార్ జైలు అధికారులు హాజరుపర్చనున్నారు.

Also Read : MLC Kavitha : కవిత జ్యుడిషియల్‌ రిమాండ్‌ పొడిగించిన సీబీఐ కోర్టు

ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 3వ తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. తదుపరి విచారణ జులై 3కు వాయిదా వేసింది. మే10వ తేదీన ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ ను పరిగణలోకి తీసుకున్న కోర్టు కవితను సమన్లు జారీచేస్తూ మీపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసుపై ట్రయల్ ప్రారంభం కావాల్సి ఉంది కాబట్టి జైల్లో ఉండాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. కవితతో పాటు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్, అరవింద్ కుమార్ యాదవ్ నిందితులకు సంబంధించి.. కవిత, చరణ్ ప్రీతి ఇద్దరు మాత్రమే అరెస్ట్ అయ్యారు. వీరి కేసును జూలై 3కు కోర్టు వాయిదా వేసింది. మిగతా ముగ్గురికి లక్ష పూచికత్తుతో వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంటుంది.

Also Read : Mlc Kavitha : అలాంటి వాళ్లను దేశం దాటించారు- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత సంచలన వ్యాఖ్యలు

కవిత ఈడీ కేసులో బయటకు రావాలంటే పైకోర్టు కవితకు బెయిల్ వస్తే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మనీస్ సిసోడియాకు బెయిల్ రాకపోవటంతో రెండేళ్లుగా జైల్లో ఉంటూనే వస్తున్నారు. అదేతరహాలో బెయిల్ వచ్చేంత వరకు కవితకూడా జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈ రోజు ఈడీ కేసులో ఛార్జిషీట్ కవిత తరపు న్యాయవాదులకు కోర్టు ఇవ్వనుంది. కాగా, లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీని జూన్ 7 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఈ కేసులో జూన్ 7న కవితపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయనుంది.