RTC MD Nagireddy : సమ్మెకు సిద్ధమైన వేళ.. కార్మికులకు ఆర్టీసీ ఎండీ కీలక విజ్ఞప్తి
RTC MD Nagireddy : ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగించిన నేపథ్యంలో.. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
RTC MD Nagireddy
RTC MD Nagireddy : టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో, కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) బుధవారం నుంచి (ఏప్రిల్ 22) రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం మొదటి డ్యూటీ నుంచే బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో తమ 32 ప్రధాన డిమాండ్లపై స్పష్టమైన హామీ లభించలేదని కార్మిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సమ్మెబాట పట్టేందుకు నిర్ణయించాయి.
Also Read ; RTC Strike : చర్చలు విఫలం.. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు బంద్.. ఆ ఒక్క డిమాండ్ వద్దే సమస్య..
ఆర్టీసీ కార్మికుల సమ్మె సైరన్ మోగించిన నేపథ్యంలో.. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఆర్టీసీ సేవలపై ఆధారపడే కూలీలు, ఉద్యోగులను దృష్టిలో ఉంచుకోవాలని, బాధ్యతాయుతంగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని కోరారు. వాస్తవాలను విస్మరించి కొన్ని సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయని, ప్రలోభాలకు లోనుకాకుండా కార్మికులు విధుల్లో చేరాలని ఆయన సూచించారు.
