New Parliament : పార్లమెంట్ ప్రారంభోత్సవ వివాదాన్ని,తెలంగాణ సచివాలయ ఓపెనింగ్‌ని ప్రస్తావిస్తు తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు
గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారు ఇదేంటీ అంటూ ప్రశ్నించారు.

new parliament governor tamilisai
New Parliament : కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై వివాదం నెలకొంది. ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీ కాకుండా రాష్ట్రపతి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈక్రమంలో పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం వివాదాన్ని..ఇటు తెలంగాణ సచివాల ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానించలేదని..కనీసం ఆహ్వాన పత్రిక కూడా ఇవ్వలేదని తెలిపారు. కానీ పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని అంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర్నర్ విషయంలో మాత్రం భిన్నమైన అభిప్రాయాలను ఎందుకు వ్యక్తం చేస్తున్నారు ఇదేంటీ అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఒకలా కేంద్రంలో ఒకలా వ్యవహరిస్తున్నారని..ప్రభుత్వాలు, ప్రజాప్రతినిథులు రాజ్యంగబద్దమైన గవర్నర్ వ్యవస్థను గౌరవించటంలేదని ఆరోపించారు. ఇప్పువారే రాజ్యాంగాధినేతను గౌరవించటంలేదంటూ మెసలికన్నీరు కారస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.తమిళనాడులోను, తెలంగానలోను రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారిని ఎలా గౌరవిస్తున్నారో కనిపిస్తోంది అంటూ విమర్శించారు. అటువంటి నేతలు ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారని రాష్ట్రపతిని అగౌరవపరుస్తున్నారు అని వివాదాలు సృష్టిస్తు క్రెడిల్ కొట్టేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. సొంత రాష్ట్రంలో రాజ్యాంగపదవిలో ఉన్నవారిని గౌరవించకుండా ఇప్పుడెలా ప్రశ్నిస్తున్నారు? అని ప్రజలే అడుగుతున్నారని గవర్నర్ తమిళిసై అన్నారు.
కాగా కొత్త పార్లమెంట్ ను ప్రధాని మోదీ ప్రారంభించటాన్ని కాంగ్రెస్ తో సహా 19పార్టీలు బహిష్కరించాయి. బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఓపెనింగ్ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ క్రమంలో అటు పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ వివాదాన్ని ఇటు తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవాన్ని ముడిపెడుతు గవర్నర్ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.