అధికారుల మెడలు వంచి తలకాయ కోస్తాం, జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

అధికారుల మెడలు వంచి తలకాయ కోస్తాం, జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Updated On : February 13, 2021 / 8:41 PM IST

Sangareddy MLA Jagga Reddy : తెలంగాణ కాంగ్రెస్ లీడర్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ..వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవలే పలువురు కామెంట్స్ చేయగా..తాజాగా.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021, ఫిబ్రవరి 13వ తేదీ శనివారం జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జగ్గారెడ్డి…ఇటు పోలీసు అధికారులపై అటు, ఐఏఎస్ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను, నేతలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

తమ వాళ్లను వేధిస్తున్న అధికారుల పేర్లను నోట్ చేసుకుని…అధికారంలోకి వచ్చాక..వారి మెడలను వంచి తలకాయలను కోస్తామంటూ..ఘాటు వ్యాఖ్యలు చేశారాయన. కలెక్టర్లు ఐఏఎస్ హోదా విలువ తీస్తున్నారని, చప్రాసీకైనా పవర్ ఉంటుంది..కానీ…కలెక్టర్లకు ఉండదంటూ ఎద్దేవా చేశారు. అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు…అయినా భయపడే ప్రసక్తే లేదు..కాంగ్రెస్ కార్యకర్త మీద..ఏ పోలీసు అధికారి జులుం చేసినా..వారి పేరును నోట్ చేసుకుంటామన్నారు. జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను అధికారులు తప్పుపడుతున్నారు.