Jagga Reddy : అప్పు చేసి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యా, సొంతిల్లు కూడా లేదు, నన్ను డ్యామేజ్ చేస్తే పార్టీకే నష్టం- జగ్గారెడ్డి సీరియస్ వార్నింగ్

రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెట్టిస్తా. Jagga Reddy - Congress

Jagga Reddy : అప్పు చేసి మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యా, సొంతిల్లు కూడా లేదు, నన్ను డ్యామేజ్ చేస్తే పార్టీకే నష్టం- జగ్గారెడ్డి సీరియస్ వార్నింగ్

Jagga Reddy - Congress (Photo - Google)

Updated On : August 21, 2023 / 9:12 PM IST

Jagga Reddy – Congress : పార్టీ మార్పు వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారడం లేదని మీడియా సమావేశంలో నేను స్పష్టంగా చెప్పినప్పటికీ కొంతమంది గుసగుసలు పెడుతున్నారని జగ్గారెడ్డి సీరియస్ అయ్యారు.

” ఇప్పటికే అనుమానం క్లియర్ చేశాను. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా? అనుమానించే వారికీ పనేమీ లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కష్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది ఇప్పటికైనా గుసగుసలు బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యా. ఏమీ సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి ఫిర్యాదు చేస్తా. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. పరువు నష్టం దావా వేస్తా” అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి.(Jagga Reddy)

Also Read..Telangana Cabinet: తెలంగాణ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం.. మాజీ మంత్రికి ఛాన్స్

” నేను 90శాతం అహింసావాదిని. 10శాతం భగత్ సింగ్ లా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని. ఇప్పటికీ నాకు సొంతిల్లు కూడా లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి. అది వారికే ఇచ్చేస్తా. ధరణిలో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే వారికే ఇస్తా.

Also Read..BRS First List: వనమాకు మరో చాన్స్.. చిన్నయ్య, శంకర్ నాయక్ సేఫ్..

నాపై సొంత పార్టీ వాళ్లు కాదు బయటి వ్యక్తులు చెడు ప్రచారం చేస్తున్నారు. జగ్గారెడ్డి అంటే వ్యక్తి కాదు. కాంగ్రెస్ లీడర్. నన్ను డ్యామేజ్ చేస్తే పార్టీకే నష్టం. మచ్చలేని నాపై లేనిపోని ప్రచారం చేస్తున్నారు. అందుకే.. పీసీసీ చీఫ్ తో కలిసి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తా. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ప్రభుత్వం చట్టం చేయాలని కోరతా” అని జగ్గారెడ్డి చెప్పారు.

జగ్గారెడ్డి పార్టీ మారుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఆయన కాంగ్రెస్ ను వీడతారని, అధికార బీఆర్ఎస్ లో చేరతారని వార్తలు పుట్టుకొచ్చాయి. దీంతో కాంగ్రెస్ లో ఒక్కసారిగా కలకలం రేగింది. పార్టీ మార్పు ప్రచారంపై జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు. అందులో ఎంతమాత్రమూ నిజం లేదన్నారు. తనపై తప్పుడు వార్తలు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం జరుగుతోందన్నారు. సమస్యలపై మాట్లాడేందుకు మంత్రులను, సీఎంను కలవడం తప్పెలా అవుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సాధారణ వ్యక్తి వినతిపత్రం ఇచ్చినట్లే తాను కూడా ఇచ్చానన్నారు. తన రాజకీయ జీవితం రాహుల్‌ వెంటేనని, సంగారెడ్డిలో రాహుల్‌ గాంధీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. పార్టీ మారడం లేదని స్వయంగా జగ్గారెడ్డి స్పష్టంగా చెప్పినా.. ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. దాంతో మరోసారి జగ్గారెడ్డి తీవ్రంగా స్పందించాల్సి వచ్చింది.