Sangh Parivar : ఇవాళ, రేపు సంఘ్ పరివార్ సమావేశాలు
తాజా రాజకీయ, సామాజిక అంశాల వారీగా... స్టేటస్ రిపోర్ట్, యాక్షన్ ప్లాన్ లపై ప్రధానంగా చర్చ జరగనుంది.

Sangh Parivar
Sangh Parivar : హైదరాబాద్ లో ఇవాళ, రేపు సంఘ్ పరివార్ క్షేత్రాల కీలక సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు వివిధ క్షేత్రాల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. భారతీయ జనతా పార్టీ, విశ్వహిందూ పరిషత్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, భారతీయ మజ్దూర్ సంఘ్, పలు సంస్థల నుంచి ఆహ్వానితులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు.
బీజేపీ నుంచి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ జాతీయ బీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ అటెండ్ అవ్వనున్నారు. ఈ సమావేశాలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ప్రతినిధులు, నేతలు.. రెండురోజుల పాటు హైదరాబాద్ లోనే బస చేయనున్నారు.
Read Also : Minister KTR : మరోసారి మంచి మనసు చాటుకున్న కేటీఆర్
ఆర్ఎస్ఎస్ జాయింట్ జనరల్ సెక్రటరీ ముకుంద ఈ సెషన్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన హైదరాబాద్ లోనే ఉంటారు. కీలక నేతలతో సమావేశం అయ్యే చాన్సుంది. తెలంగాణలో మరింత బలపడేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సమన్వయ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోనున్నారు. హైదరాబాద్ సిటీ శివారులో ఈ మీటింగ్స్ జరగనున్నాయి.
సంఘ్ పరివార్ క్షేత్రాల కీలక సమావేశాల్లో తాజా రాజకీయ, సామాజిక అంశాల వారీగా… స్టేటస్ రిపోర్ట్, యాక్షన్ ప్లాన్ లపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఆయా క్షేత్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలు, భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించనున్నారు ప్రతినిధులు. ఆయా సంస్థలు తమ తమ క్షేత్రాల్లో ఏ మేరకు విస్తరించాయి… ఆయా క్షేత్రాల్లో వాటి ప్రభావం ఎంత అనే దానిపై సమీక్షించనున్నారు. సంఘ్ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ జాతీయ నేతలు మార్గనిర్దేశం చేయనున్నారు.
Read Also : Bandi Sanjay: పంట కొనేవరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదు -బండి సంజయ్