SSC Advanced Exam: టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్ ఇదే.. ఫీజు ఎప్పటివరకు చెల్లించాలంటే..?
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకోసం అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

10th Advanced Supplementary exams
SSC Advanced Exam: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయి. ఏప్రిల్ 30వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,60,519 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అయితే, టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
ప్రతీరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అయితే, సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకే ఉంటాయి. ఫెయిలైన విద్యార్థులతోపాటు.. మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని ఇంప్రూవ్ మెంట్ రాయాలనుకునే విద్యార్థులు ఈనెల 16వ తేదీ వరకు ఎగ్జామ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ఆ తరువాత.. పరీక్షలకు రెండు రోజుల ముందు వరకూ రూ.50 ఫైన్ తో ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
పరీక్షల షెడ్యూల్ ఇలా..
జూన్3 : ఫస్ట్ లాంగ్వేజ్
జూన్4 : సెకండ్ లాంగ్వేజ్
జూన్5 : ఇంగ్లిష్
జూన్6 : మ్యాథమెటిక్స్
జూన్9 : ఫిజికల్ సైన్స్
జూన్10 : బయోలాజికల్ సైన్స్
జూన్11 :సోషల్ స్టడీస్
జూన్12 : ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్ -1
జూన్13 : ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ పేపర్-2