MLA Shakeel Car Accident : ఎమ్మెల్యే షకీల్‌ కారు ప్రమాదం కేసులో విస్తు గొలిపే విషయాలు

కారు ప్రమాదంలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్‌ను నిమ్స్ నుంచి తరలించింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

MLA Shakeel Car Accident : ఎమ్మెల్యే షకీల్‌ కారు ప్రమాదం కేసులో విస్తు గొలిపే విషయాలు

Mla Shakeel Car

Updated On : March 23, 2022 / 4:19 PM IST

MLA Shakeel’s car accident case : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్ 45లో ఎమ్మెల్యే షకీల్ కారు ప్రమాదం కేసులో బయటకొస్తున్న విషయాలు కలకలం రేపుతున్నాయి. నిమ్స్ నుంచి పారిపోయిందని చెబుతున్న బాధితురాలు కాజల్‌ చౌహాన్.. మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని బంధువులు అంటున్నారు. కారు ప్రమాదంలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్‌ను నిమ్స్ నుంచి తరలించింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చికిత్స పొందుతున్న బాధితులు పారిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్న దాంట్లో అసలు నిజం ఉందా?.. ఎందుకంటే రెండు కాళ్లు విరిగిపోయి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ ఎవరి సాయం లేకుండా అక్కడి నుంచి పారిపోయే ఛాన్స్ ఉంటుందా? అసలు నిమ్స్‌లో ఏం జరుగుతోంది? అనే అనుమానం తలెత్తుతోంది.

పూటగడవని స్థితిలో ఉన్న ఆ మహిళ నిమ్స్‌లో చికిత్స అందిస్తుంటే కాదని మహారాష్ట్రకు వెళ్లి.. అదీ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుందా? కన్న బిడ్డను కళ్ల ముందే కారుతో ఢీకొట్టి చంపేసిన వాళ్లను ఏ తల్లైనా వదిలేసి వెళ్లిపోతుందా? కనీసం లేచి నిలబడలేని స్థితితో ఉన్న మహిళను మహారాష్ట్రకు అంబులెన్స్‌లో తరలించింది ఎవరనే ప్రశ్నకు ఎమ్మెల్యే షకీల్ సమాధానం చెబుతారా? ఈ మొత్తం వ్యవహారంలో అందరి వేళ్లూ ఎమ్మెల్యే షకీల్‌ వైపే చూపిస్తున్నాయి. కేసును తారు మారు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు, హోదా ఉంటే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

MLA Shakeel : జూబ్లీహిల్స్ ప్రమాదం కేసు.. అనేక ప్రశ్నలు.. అనేక మలుపులు

ఇక బాధితులను నోరెత్తకుండా చేసి ఊరు దాటించేసిన వాళ్లు పోలీసు కేసునూ నీరు గార్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులూ వీరికి వంతపాడుతున్నట్లే కనిపిస్తోంది. ఇక బాధితురాలు కాజల్ చౌహాన్ కేసు షీటు కూడా నిమ్స్‌ నుంచి మాయమైంది. మరి ఇది ఎలా జరిగింది? నడవలేని స్థితిలో .. ప్రాణాపాయస్థితిలో ఉన్న మహిళ ఆస్పత్రి గేటు దాటుతుంటే.. నిమ్స్ వైద్యులు, సిబ్బంది, సెక్యూరిటీ ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు లేరు. ఒక మెడికో లీగల్‌ కేసుల్లో ఇంత నిర్లక్ష్యంగా నిమ్స్ సిబ్బంది వ్యవహరిస్తారా? అసలు నిమ్స్ సిబ్బందిని ఆడిస్తున్నదెవరనేదే ఇప్పుడు ఈ కేసులో కీలక పాయింట్‌.. నిమ్స్ నుంచి బాధితులను తప్పించడంలో ఎమ్మెల్యే షకీల్‌ పాత్ర ఏమైనా ఉందా? అన్న ఆరోపణలూ వస్తున్నాయి.

బాధితుల దీనస్థితిని షకీల్ అండ్‌ కో చాలా అలుసుగా తీసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను తప్పించడం కోసం బాధితులను బెదిరించి కాంప్రమైజ్ చేస్తే.. ఇక కేసే ఉండదా? ప్రమాదం జరిగి వారం రోజులు దాటినా ఇంత వరకూ ఎమ్మెల్యే షకీల్‌ కొడుకును పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ప్రమాదం జరిగిన రోజు ఒక వ్యక్తిని స్థానికులు చితక బాదారని అక్కడున్న వారు చెబుతున్నారు.

MLA Shakeel Car : జూబ్లీహిల్స్‌‌లో ఎమ్మెల్యే కారు బీభత్సం.. యాచకురాలిని ఢీ.. రెండున్నర నెలల చిన్నారి మృతి

ఆరోజు జనం చేతిలో దెబ్బలు తిన్నది షకీల్ కొడుకు రాహీలేనా? రాహిల్ తన్నులు తినడం చూసి ఓ ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేశారని ప్రచారం జరుగుతోంది.. పొలిటికల్ ప్రమేయంతోనే ప్రమాదం జరిగిన స్పాట్‌కు వచ్చిన పోలీసులు రాహీల్‌ను తప్పించారా..? అన్నదీ తేలాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది అంతకు మించి ఎవరినో తప్పించాలనే తాపత్రయం కూడా ఉందనే అనుమానాలు కలిగిస్తోంది.