Shameerpet Gun Firing : శామీర్‌పేట కాల్పుల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Shameerpet Gun Firing : సిద్ధార్థ్ దాస్ ను భయభ్రాంతులకు గురి చేయడానికి ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు మనోజ్.

Shameerpet Gun Firing : శామీర్‌పేట కాల్పుల కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

Shameerpet Gun Firing (Photo : Google)

Updated On : July 16, 2023 / 8:18 PM IST

Shameerpet Gun Firing – Remand Report : హైదరాబాద్ లో సంచలనం రేపిన శామీర్ పేట కాల్పుల కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నాయి. 200 లో స్మిత గ్రంధితో సిద్ధార్థ్ దాస్ కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమారుడు-17ఏళ్లు, కుమార్తె-13ఏళ్లు). గతంలో వీరిద్దరూ మూసాపేటలో ఉండేవారు. 2018లో‌ సిద్ధార్థ్ పై గృహహింస కింద భార్య స్మిత ఫిర్యాదు చేసింది. అనంతరం విడాకులకు అప్లయ్ చేసింది. అప్పటి నుండి‌ భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు.

తమను మనోజ్‌ అలియాస్ సూర్యతేజ హింసిస్తున్నట్లుగా CWC కి స్మిత కొడుకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి సిద్ధార్థ్ దాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30గంటలకి సెలెబ్రిటీ విల్లా వెళ్లారు. సిద్ధార్థ్ ను చూడగానే మనోజ్ ని పిలిచారు స్మిత. లోపలి నుండే ఎయిర్ గన్ తో సిద్ధార్థ్ ను దూషిస్తూ వచ్చాడు మనోజ్. సిద్ధార్థ్ దాస్ ను భయభ్రాంతులకు గురి చేయడానికి ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు మనోజ్.

Also Read..ATM Video: మీరు ఏటీఎంకు వెళ్తున్నారా? అయితే ఈ వీడియో చూసి అప్రమత్తం అవ్వాల్సిందే..

సిద్ధార్ధ్ దాస్ తప్పించుకుని వెళ్లిపోయాడు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్మితతో తన బంధానికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్ ను చంపేయాలనుకుని మనోజ్ అనుకున్నాడు. ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన ఎయిర్ గన్ లో పెల్లెట్స్ నింపి సిద్ధార్థ్ పై షూట్ చేశాడు.

మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్ లో నటించాడు. అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయమై స్మిత డిఫ్రెషన్ కౌన్సెలింగ్ కు మనోజ్ వెళ్లాడు. అనంతరం స్మితతో సన్నిహితంగా మెలిగాడు. స్మిత కొడుకు‌పై చదువు విషయంలో దురుసుగా ప్రవర్తించాడు మనోజ్. స్మిత కొడుకు ఫిర్యాదు మేరకు మనోజ్ వ్యవహారంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read..Bihar : ప్రాణం తీసిన పందెం.. 150 మోమోస్ తిని అక్కడికక్కడే మృతి చెందిన యువకుడు, వెయ్యి రూపాయల కోసం..