YS Sharmila : షర్మిల పార్టీ వ్యూహకర్త ఫిక్స్.. ఎవరో తెలుసా ?

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న దివంగత వైఎస్‌ఆర్ కుమార్తె...వైఎస్‌ షర్మిల కూడా..రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియను ఎంచుకోవడం గమనార్హం.

YS Sharmila : షర్మిల పార్టీ వ్యూహకర్త ఫిక్స్.. ఎవరో తెలుసా ?

Sharmila

Updated On : July 3, 2021 / 12:10 PM IST

YS Sharmila Political Strategist : ఎన్నికల్లో గెలిచేందుకు..అనుసరించాల్సిన మార్గాలు..వ్యూహాలు రచించే వ్యూహకర్తలకు మంచి డిమాండ్ ఉంది. కొన్ని పార్టీలు వ్యూహకర్తల కోసం వెతుకుతుంటాయి. తమను అధికారంలోకి తీసుకొచ్చే వ్యూహకర్తల కోసం అన్వేషిస్తుంటాయి పలు పార్టీలు. వ్యూహకర్త అనగానే..ముందుగా గుర్తకు వచ్చేది..ప్రశాంత్ కిశోర్. కానీ..తాను వ్యూహకర్తగా పనిచేయనని ఇటీవలే ప్రశాంత్ కిశోర్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

తాజాగా..తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్న దివంగత వైఎస్‌ఆర్ కుమార్తె…వైఎస్‌ షర్మిల కూడా..రాజకీయ వ్యూహకర్తను నియమించుకున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూరు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కుమార్తె ప్రియను ఎంచుకోవడం గమనార్హం. ఈ మేరకు షర్మిలను లోటస్ పాండులో కలుసుకున్నారు. వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ టీంలో ప్రియ పనిచేసిన అనుభవం ఉంది. సోషల్ మీడియాతో పాటు..పార్టీ వ్యూహాలపై ప్రియ సలహాలు, సూచనలు అడిగి తెలుసుకోనున్నారు.

2021, జూలై 08వ తేదీన పార్టీని ప్రకటించనున్నారు షర్మిల. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో షర్మిల పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ…ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న షర్మిల పార్టీకి..వ్యూహకర్తగా ప్రియ ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారో చూడాలి.