YS Sharmila: పోలీసులపై దాడి కేసులో.. వైఎస్ షర్మిలకు బెయిల్ మంజూరు
పోలీసులపై దాడి కేసులో అరెస్ట్‌అయ్యి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.

YS Sharmila
YS Sharmila: పోలీసులపై దాడి కేసులో అరెస్ట్‌అయ్యి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు బెయిల్ మంజూరు అయింది. నాంపల్లి కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. 30వేల రూపాయల రెండు ష్యురిటీలతో పాటు, విదేశాలకు వెళ్లాలనుకునే సమయంలో కోర్టు అనుమతి తప్పనిసరి అని సూచించింది. దర్యాప్తుకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. 24న( సోమవారం) ఉదయం వైఎస్ షర్మిల జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, షర్మిలకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఆగ్రహంతో ఊగిపోయిన షర్మిల పోలీసులపై చేయి చేసుకున్నారు.
YS Sharmila : చంచల్‌గూడ జైలుకి వైఎస్ షర్మిల
పోలీసులపై చేయిచేసుకోవటంతో షర్మిలను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం సాయంత్రం పోలీసులు షర్మిలను నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా ఆమెకు 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను వైద్యపరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. షర్మిల తరపు న్యాయవాది బెయిల్ మంజూరు కోసం పిటీషన్ దాఖలు చేయగా.. కౌంటర్ దాఖలుకు కోర్టు పోలీసులను ఆదేశించింది.
YS Sharmila : చంచల్‌గూడ జైలుకి వైఎస్ షర్మిల.. 14రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
బెయిల్ మంజూరిపై మంగళవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. షర్మిలకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఇదిలాఉంటే చంచల్‌గూడ జైలులో ఉన్న వై.ఎస్. షర్మిలను మంగళవారం ఉదయం ఆమె తల్లి వై.ఎస్. విజయమ్మ వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్న షర్మిల సాయంత్రం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.