MLC Teenmar Mallanna : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షాక్..! షోకాజ్ నోటీసులు జారీ..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వైఖరి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆయన మాటలు, చర్యలు పార్టీలో మంటలు పుట్టిస్తున్నాయి.

MLC Teenmar Mallanna : అనుకున్నట్లే జరిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు షాక్ తగిలింది. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఈ నోటీసులు జారీ చేశారు. కులగణన సర్వేకు వ్యతిరేకంగా మాట్లాడటం, కులగణన నివేదిక పత్రాలను తగలబెట్టడం, ఒక కులాన్ని దూషించడంపై పార్టీ సీరియస్ గా ఉంది. ఎమ్మెల్సీగా ఉండా పార్టీ రాజ్యాంగాన్ని, విధానాలను అతిక్రమించారని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులకు ఫిబ్రవరి 12లోపు వివరణ ఇవ్వాలని, లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
Also Read : ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌తో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్.. అంతా సెట్ అయ్యేనా..?
కులగణన సర్వే రిపోర్టు పత్రాలను తగలబెట్టడంపై సీరియస్..
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వైఖరి కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వే పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మల్లన్న. సర్వే రిపోర్టు పత్రాలను కూడా ఆయన తగలబెట్టారు. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది.
ఇక, ఇటీవల నిర్వహించిన బీసీ గర్జన సభలో ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించి దుర్భాషలాడుతూ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సొంత పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే మల్లన్న వ్యతిరేకించడాన్ని పార్టీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు.
Also Read : సిరిసిల్లకు బైపోల్..? సీఎం రేవంత్ మాటల్లో అర్థమేంటి..?
మల్లన్న వైఖరిపై ఫిర్యాదుల వెల్లువ..
మల్లన్న తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పీసీసీకి ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన పీసీసీ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో మల్లన్న అంశం చర్చకు వచ్చింది. షోకాజ్ నోటీసులు ఇచ్చి మల్లన్న నుంచి వివరణ తీసుకోవాలని ఇంఛార్జ్ దీపాదాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
సీఎల్పీ సమావేశం అనంతరం దీపాదాస్ మున్షీ ఇదే అంశాన్ని చెప్పారు. ఆమె మాట్లాడిన కాసేపటికే.. మల్లన్నకు షోకాజ్ నోటీసులు గాంధీభవన్ నుంచి రిలీజ్ అయ్యాయి. పీసీసీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి పేరిట ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బీసీ కులగణకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, పత్రాలను తగలబెట్టడం వంటి అంశాలపై వివరణ కోరారు.
చిచ్చు రాజేసిన తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు..
కులగణన సర్వే పై తీవ్ర వ్యాఖ్యలే చేశారు మల్లన్న. అదొక దొంగ సర్వే అని ఆయన ఆరోపించారు. బీసీలను రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ధ్వజమెత్తారు. అంతేకాదు కులగణన సర్వే పేపర్లను కూడా తగలబెట్టారు. ఈ సర్వేను తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము అని తేల్చి చెప్పారు మల్లన్న. సర్వేలో దాదాపు 40 లక్షల మంది బీసీలను తగ్గించటం అన్యాయం అని.. ఈ విషయాన్ని బీసీలు సహించరని మల్లన్న స్పష్టం చేశారు.