Telangana Congress : ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్‌తో ఉలిక్కిపడ్డ కాంగ్రెస్.. అంతా సెట్ అయ్యేనా..?
Telangana Congress : రహస్య భేటీ అయిన పది మంది ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీ అవుతారని నాలుగు రోజులుగా చర్చ జరుగుతోంది. పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుండటం ఆసక్తి రేపుతోంది.

Telangana Congress MLA's Meeting
Telangana Congress : అంతా బాగుంది కానీ ఎక్కడో తేడా కొడుతుంది సీనా అన్నట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఓ ఇష్యూ అయిపోగానే మరో టాపిక్‌తో..అయితే అంతర్గత కుమ్ములాటలు.. లేకపోతే అపోజిషన్ ప్రెజర్‌తో సతమతం అవుతున్న కాంగ్రెస్ పార్టీకి పిడుగులాంటి వార్త గుండెలు గుభేల్ చేసిందట. అదే ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆర్గనైజ్ చేసిన మీటింగ్‌కు పది మంది ఎమ్మెల్యేలు వెళ్లారన్న ప్రచారం కాంగ్రెస్ పెద్దలను, తెలంగాణ రాజకీయాలను మరింత ఇంట్రెస్టింగ్‌గా మార్చేశాయి.
Read Also : Sircilla ByPoll : సిరిసిల్లకు బైపోల్..? సీఎం రేవంత్ మాటల్లో అర్థమేంటి..?
ఆ భేటి నిజమే అంటున్న ఎమ్మెల్యేలు :
ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తి రాగం వినిపించారని..దాని వెనుక ఎన్నో ఈక్వేషన్స్ ఉన్నాయని..రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే భేటీ అయింది నిజమేనని పలువురు ఎమ్మెల్యేలు ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్ మాట్లాడిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తగ్గేదేలే అని చెప్పడంతో.. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షి టచ్‌లోకి వచ్చారు. తాను వచ్చే వరకు ఎక్కడా ఈ విషయం గురించి మాట్లాడొద్దని ఆమె ఎమ్మెల్యేకు సూచించారు.
ఆ జిల్లాల నేతలతో సీఎం భేటీ :
అయితే ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ ఇష్యూ చర్చనీయాంశం కావడంతో కాంగ్రెస్ పెద్దలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయి..అంతా సెట్ చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌లు ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీ కానున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలకు టైమ్ కేటాయించారు. మొదట ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. ఆ తర్వాత కరీంనగర్ వరంగల్ జిల్లాల ఎమ్మెల్యేలతో చర్చిస్తారు. చివరగా మెదక్, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలతో డిస్కస్ చేసి.. వాళ్ల ప్రాబ్లమ్స్ ఏంటో విననున్నారు.
అయితే రహస్య భేటీ అయిన పది మంది ఎమ్మెల్యేలతో దీపాదాస్ మున్షి భేటీ అవుతారని నాలుగు రోజులుగా చర్చ జరుగుతోంది. కానీ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలతో సమావేశం అవుతుండటం ఆసక్తి రేపుతోంది. అయితే సీక్రెట్ మీటింగ్ వెళ్లని మరికొందరు ఎమ్మెల్యేలు కూడా మంత్రుల తీరుపై అసంతృప్తిగా ఉన్నారట. తమ నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే టైమ్ ఇవ్వడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట.
అధికారులు కూడా తమ మాట వినడం లేదని ఆగ్రహంతో రలిగిపోతున్నారట హస్తం పార్టీ ఎమ్మెల్యేలు. గాంధీభవన్‌లో జరిగిన భేటీ కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నా మంత్రుల తీరులో మార్పు రావడం లేదట. అందుకే ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారట. అది కూడా ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది.
అయితే భేటీ హట్ హాట్‌గా సాగే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రుల తీరుపై అసంతృప్తితో రలిగిపోతున్న పలువురు ఎమ్మెల్యేలు తమ వాయిస్ బలంగా వినిపించాలని ఫిక్స్ అయ్యారట. సీఎం, రాష్ట్ర ఇంచార్జ్ ముందే ఏదో ఒకటి తేల్చుకోవాలని భావిస్తున్నారట. అయితే మంత్రులతో ఎమ్మెల్యేల గ్యాప్‌ను ఎలా సెట్ చేస్తారన్నదే హాట్ టాపిక్‌గా మారింది.
కేసీ వేణుగోపాల్ చెప్తే కూడా పలువురు మంత్రుల తీరులో మార్పు రాలేదంటే..సీఎం రేవంత్, దీపాదాస్ మున్షి చెప్తే.. ఎమ్మెల్యేలతో రాజీకి ఒప్పుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మధ్య ఉన్న పంచాయితీని తెంపడం అంత ఈజీ కాదన్నది గాంధీభవన్ వర్గాల టాక్. ఈ పరిస్థితుల్లో ప్రత్యేక భేటీ అన్ని ఇష్యూస్‌కు ఎండ్ కార్డు వేస్తుందా.. లేక హస్తినకు దారి తీస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.
Read Also : YSRCP vs TDP : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు :
ఇక బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను జనంలోకి పాజిటీవ్‌గా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు దిశానిర్ధేశం చేయనున్నారట పార్టీ పెద్దలు. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహంపై కూడా డిస్కస్ చేస్తారట. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు ఇచ్చే 42 శాతం రిజర్వేషన్లను బలంగా జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్న ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్న విషయాన్ని విస్తృతంగా పబ్లిక్‌లోకి తీసుకెళ్లాలని అనుకుంటోంది.
ఎమ్మెల్యేలతో ప్రత్యేక భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో లోకల్ లీడర్లతో ఉన్న ఇబ్బందులు, మంత్రులతో గ్యాప్, అధికారులు తమ మాట వినడం లేదన్న విషయాలన్నీ సీఎంతో పాటు పార్టీ పెద్దలకు చెప్పుకోనున్నారట ఎమ్మెల్యేలు. ప్రత్యేక భేటీ తర్వాత అయినా ఎమ్మెల్యేల సమస్యలు పరిష్కారం అవుతాయా..లేక కథ మళ్లీ మొదటికే వస్తుందా అనేది వేచి చూడాలి మరి.