Sircilla ByPoll : సిరిసిల్లకు బైపోల్‌..? సీఎం రేవంత్ మాటల్లో అర్థమేంటి..?

Sircilla ByPoll : సిరిసిల్లకు బైపోల్‌ ఎలా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రొటీన్‌గానే ఈ కామెంట్స్ చేశారా లేక మరేదైనా కారణముందా అన్నదే ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Sircilla ByPoll : సిరిసిల్లకు బైపోల్‌..? సీఎం రేవంత్ మాటల్లో అర్థమేంటి..?

CM Revanth Reddy

Updated On : February 5, 2025 / 10:04 PM IST

Sircilla ByPoll : తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా.? బైపోల్స్ వస్తే మూడు స్థానాలకేనా.? లేదంటే మొత్తం పది నియోజకవర్గాలకా.? ఇప్పుడిదే రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న అంశం. ఓ వైపు సుప్రీంకోర్టులో విచారణ, మరోవైపు ఎమ్మెల్యేలకు నోటీసులు..జంపింగ్‌ ఎమ్మెల్యేల మీటింగ్‌..ఈ డెవలప్‌మెంట్‌ చూస్తుంటే ఉపఎన్నికలు రావొచ్చన్న అంచనాలు  బలపడుతున్నాయి.

కేటీఆర్ మాటలకు సీఎం రేవంత్ కౌంటర్‌ :
బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ అయితే బైపోల్స్ రావడం పక్కా సిద్ధంగా ఉండాలని క్యాడర్‌కు పిలుపునిస్తున్నారు. కేటీఆర్ మాటలకు కౌంటర్‌గా సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఆసక్తిరేపుతున్నాయి. సిరిసిల్లకు కూడా బైపోల్ తప్పదంటున్నారు సీఎం రేవంత్. ఆయన చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు రకరకాల చర్చకు దారి తీస్తోంది. కేటీఆర్‌పై అటాక్‌ చేసే క్రమంలో రొటీన్‌గానే రేవంత్ ఈ కామెంట్స్‌ చేశారా లేక ఆయనపై ఉన్న కేసులను దృష్టిలో పెట్టుకుని అలా మాట్లాడారా అన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

Read Also : Nara Lokesh : నవ్యాంధ్రకు నిధుల కోసం లోకేశ్‌ పరుగులు.. ఇటు ప్రభుత్వం.. అటు పార్టీలో చిన్నబాబు మార్క్‌.!

ఉపఎన్నికలు వస్తాయని వారం రోజులుగా తెలంగాణలో హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. జంపింగ్‌ ఎమ్మెల్యేలకు కూడా ఇదే గుబులు పట్టుకుంది. కాంగ్రెస్‌లోనూ టెన్షన్ కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై..ఆరు నెలలుగా న్యాయపోరాటం చేస్తోంది కారు పార్టీ.

ఆ పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయం :
సుప్రీం సూచనతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించిన విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. దీంతో కచ్చితంగా సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, ఆ పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నారు.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ పది ఎమ్మెల్యేల్లో ముందుగా.. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌లపై కోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. ఇప్పుడీ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ నెల 10న కేసుకు విచారణ జరగనుండగా ఈ ముగ్గురిపై వేటు పడుతుందా..లేదంటే స్పీకర్ మరో ఏడు మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చారు కాబట్టి..మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా అన్నదే ఉత్కంఠగా మారింది.

సుప్రీంకోర్టు గనుక ఫిరాయింపులపై తేల్చేస్తే పది నియోజకవర్గాలకు ఉపఎన్నికలు రావడం పక్కా అన్న చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు విచారణ, వారికి స్పీకర్ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్తైల్‌లో స్పందించారు. నిబంధనల ప్రకారమే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని, అందుకు వారు సమాధానం ఇస్తారని చెప్పారు.

సిరిసిల్లకు బైపోల్‌ ఎలా వస్తుంది? :
మార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వస్తాయన్న కేటీఆర్ వ్యాఖ్యలపైనా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ పది నియోజకవర్గాలకు బైఎలక్షన్ వస్తే సిరిసిల్ల నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక వస్తుందని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడీ అంశమే రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సిరిసిల్లకు బైపోల్‌ ఎలా వస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రొటీన్‌గానే ఈ కామెంట్స్ చేశారా లేక మరేదైనా కారణముందా అన్నదే ఇంట్రెస్టింగ్‌గా మారింది.

కేటీఆర్‌పై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ, ఈడీ కేసులను ఎదుర్కొంటున్న కేటీఆర్..స్వయంగా విచారణకు హాజరయ్యారు. కోర్టులో పిటీషన్‌ కూడా వేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొలిక్కి వస్తుండగా ఆ ఇష్యూలో కూడా కేటీఆర్‌పై అలిగేషన్స్ ఉన్నాయి. దీంతో ఈ కార్ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేటీఆర్‌ తప్పకుండా జైలుకు వెళ్లక తప్పదని రేవంత్‌ రెడ్డి అంటున్నారట.

Read Also :  YSRCP vs TDP : నాడు వైసీపీ.. నేడు కూటమి.. మున్సిపాలిటీల్లో పవర్ గేమ్..!

సిరిసిల్ల ఉపఎన్నికపై కాంగ్రెస్ వర్గాల్లో చర్చ  :
అలా నేరం రుజువై.. ఎమ్మెల్యేకు కనీసం రెండుళ్లకుపైగా జైలు శిక్ష పడితే శాసనసభ సభ్యత్వం రద్దవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లకు ఉపఎన్నిక వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేసి ఉంటారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరి కేటీఆర్‌పై నమోదైన కేసులు, ఆరోపణలు బైపోల్‌కు దాకా దారి తీస్తాయా..లేక పొలిటికల్‌ గేమ్‌లో భాగంగానే రేవంత్ అలా మాట్లాడారా అన్నది ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. ఈనెల పదిన సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బైపోల్‌ రాజకీయం ఇంకెంత దూరం వెళ్లనుందో ఇంకోంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.