సృష్టి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. పిల్లల్ని అమ్మే గ్యాంగులతో నమ్రతకు లింకులు..
గతంలోనూ పిల్లల్ని అమ్ముతూ అరెస్ట్ అయ్యారు నందిని, హర్ష, పవన్. ఒక్కొక్క పిల్లాడిని 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చి నమ్రత కొనుగోలు చేసింది.

సృష్టి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డాక్టర్ నమ్రత రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. పిల్లల్ని అమ్మే గ్యాంగులతో లింకులు పెట్టుకుంది నమ్రత. మహారాష్ట్ర, అహ్మదాబాద్, ఆంధ్రకు చెందిన గ్యాంగ్‌లతో ఆమెకు లింకులు ఉన్నాయి.
పిల్లల్ని కొని అమ్ముతున్న నందిని, హర్ష , పవన్‌తో ఆమె సంప్రదింపులు జరిపేది. గతంలోనూ పిల్లల్ని అమ్ముతూ అరెస్ట్ అయ్యారు నందిని, హర్ష, పవన్. ఒక్కొక్క పిల్లాడిని 3 నుంచి 5 లక్షల రూపాయలు ఇచ్చి నమ్రత కొనుగోలు చేసింది. ఐవీఎఫ్ కోసం వచ్చే దంపతులను సరోగోసివైపు మళ్లించి అక్రమాలకు పాల్పడింది.
Also Read: ఇచ్చి పడేసిన బీసీసీఐ.. బూమ్రా, రోహిత్ శర్మకు ఇన్‌డైరెక్ట్‌గా స్ట్రాంగ్ వార్నింగ్..
హైదరాబాద్‌లో మరో నాలుగు సెంటర్లకు కూడా నందిని, హర్ష, పవన్ పిల్లల్ని అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్న పలు ఫెర్టిలిటీ సెంటర్లతో ఆ గ్యాంగుకు సంబంధాలు ఉన్నాయి. పిల్లల అమ్మకాలతో పాటు యువతి, యువకులను ఆ గ్యాంగ్ ట్రాప్ చేస్తోంది.
వీర్యకణాలు, అండాలను సేకరించి అమ్ముతోంది. డాక్టర్ నమ్రత పెద్ద ఎత్తున ఈ గ్యాంగ్ కు డబ్బులు ముట్టజెప్పినట్లు పోలీసులు గుర్తించారు. సృష్టి కేసులో కీలక పాత్ర పోషించారు గాంధీ ఆసుపత్రి అనస్థీషియా డాక్టర్ సదానందం. ప్రతి ఆపరేషన్ వెనకాల సదానందం పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.