నిరుద్యోగ యువతకు శుభవార్త.. 100 ప్రైవేట్ సంస్థల్లో 3వేల ఉద్యోగాలు.. ఎంపికలకోసం జాబ్‌మేళా

నిరుద్యోగ యువతకు శుభవార్త. సుమారు 100 ప్రైవేట్ సంస్థలలో వివిధ విభాగాల్లో 3వేల ఖాళీలు భర్తీ కోసం

నిరుద్యోగ యువతకు శుభవార్త.. 100 ప్రైవేట్ సంస్థల్లో 3వేల ఉద్యోగాలు.. ఎంపికలకోసం జాబ్‌మేళా

Job Mela

Updated On : May 16, 2025 / 1:56 PM IST

Singareni Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త. సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనుంది. రామగుండం 1 ఏరియా గోదావరిఖనిలో ఆదివారం (18వ తేదీ)న ఈ మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.

 

ఆదివారం నిర్వహించే మెగా జాబ్ మేళాలో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన సుమారు 100 ప్రైవేట్ సంస్థలలో వివిధ విభాగాల్లో 3వేల ఖాళీలు భర్తీ కోసం ఎంపికలు జరుగుతాయని బలరామ్ చెప్పారు. నిరుద్యోగ యువత హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయడం వ్యయప్రయాసలతో కూడుకుని ఉంటోందని, ఈ నేపథ్యంలో పలు సంస్థల ప్రతినిధులతో మాట్లాడి స్థానికంగా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

 

సింగరేణి సంస్థ సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంకోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఇప్పటికే మందమర్రి, రామగుండం-1, భూపాలపల్లి ఏరియాల్లో ప్రారంభించడం జరిగిందని, ఇతర ఏరియాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తున్నామని అన్నారు. యువతలో నైపుణ్యాలు పెంచడమే కాకుండా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ జాబ్ మేళాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

Also Read: Gold Rate Today: అరెరే.. మళ్లీ ఏమైంది..! భారీగా పెరిగిన గోల్డ్ రేటు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా..

Also Read: Hyderabad Metro : హైదరాబాద్‌ మెట్రో ప్రయాణికులకు షాక్..