Smugglers Arrest : నిషేధిత ఆయిల్‌ విక్రయిస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లు

హైదరాబాద్‌లో నిషేధిత హాష్‌ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. బోరబండకు చెందిన మహబూబ్‌ అలీ ప్రధాన నిందితుడు.

Smugglers Arrest : నిషేధిత ఆయిల్‌ విక్రయిస్తూ పట్టుబడ్డ స్మగ్లర్లు

Banned Oil

Updated On : September 8, 2021 / 7:37 AM IST

banned hashish oil : హైదరాబాద్‌లోని ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులకు… నిషేధిత హాష్‌ ఆయిల్‌ను విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌, ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులు సంయుక్తంగా చేసిన దాడిలో చిక్కిన ఇద్దరు నిందితుల నుంచి 25 బాక్స్‌ల హాష్‌ ఆయిల్‌ను, రెండు సెల్‌ ఫోన్లను సీజ్ చేశారు.

లక్ష రూపాయల విలువ చేసే నార్కోటిక్ పరికరాలు పట్టుబడడంతో దర్యాప్తును సీరియస్‌గా టేకప్ చేశారు పోలీసులు. యువతను టార్గెట్‌ చేసి మత్తు పదార్థాలకు బానిసలయ్యేలా చేసి వారికి డ్రగ్స్‌ను విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

బోరబండకు చెందిన మహబూబ్‌ అలీ ఈ కేసులో ప్రధాన నిందితుడు. మహబూబ్‌ అలీపై రెండు రాబరీ కేసులు, హత్యాయత్నం కేసు ఉన్నాయి. కూలీగా పనిచేసే ఇబ్రహీంఖాన్‌, విద్యార్థి ఖాజా ముబీనుద్దీన్‌ ఇద్దరు గంజాయి, హాష్‌ ఆయిల్, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. ఈ ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు…మహబూబ్‌ అలీ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.