Soyam Bapu Rao: వారి కోసం చావుకైనా సిద్ధమే: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు

"పాస్టర్లపై నేను చేసిన వ్యాఖ్యలను రాద్ధాంతం చేయొద్దు. బలవంతపు మతమార్పిడులు, లవ్ జిహాద్ లకు నేను వ్యతిరేకం" అని అన్నారు.

Soyam Bapu Rao: వారి కోసం చావుకైనా సిద్ధమే: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు

Soyam Bapurao

Updated On : June 2, 2023 / 8:25 PM IST

Soyam Bapu Rao – BJP: అమాయక ఆదివాసీలను మత మార్పిడి చేయిస్తే బుల్లెట్లు దింపుతామంటూ ఇటీవలే హెచ్చరించిన తెలంగాణ (Telangana ) ఎంపీ, బీజేపీ నేత సోయం బాపూరావు దీనిపై మరోసారి స్పందించారు. ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు.

“పాస్టర్లపై నేను చేసిన వ్యాఖ్యలను రాద్ధాంతం చేయొద్దు. బలవంతపు మతమార్పిడులు, లవ్ జిహాద్ లకు నేను వ్యతిరేకం. ఆదివాసీ జాతి రక్షణ కోసం చావుకైనా సిద్ధమే. జన సురక్ష మంచ్ సభలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ పబ్బం కోసం వక్రీకరిస్తున్నారు.

నన్ను టార్గెట్ చేసి విమర్శలు, ఆందోళనలు చేస్తున్నారు. క్రైస్తవులంటే నాకు ఎలాంటి ద్వేషం లేదు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను కానీ.. ఏజెన్సీ ప్రాంతాల్లో అమాయక ఆదివాసీలను కొందరు పాస్టర్లు ప్రలోభ పర్చి బలవంతపు మాత మార్పిడీలు చేస్తున్నారు. మా జాతి యువతులను మాయ మాటలతో లవ్ జిహాద్ ఉచ్చులో దించుతున్నారు.

మతం మారిన ఆదివాసీలను ఎస్టీల నుంచి తొలగించి రిజర్వేషన్ లను రద్దు చేయాలి. మనో వేధనతో ఘాటుగా మాట్లాడి ప్రతీకార చర్యలతో బుల్లెట్ల మాదిరిగా ప్రతిఘటిస్తామని చెప్పాను. ఏజెన్సీ ప్రాంతాలో 5వ షెడ్యూల్ ప్రకారం అన్యమత ప్రచారం రాజ్యాంగ విరుద్ధం.

ఇంత కాలం మేము ఓపిక, సహనంతోనే ఉన్నాం… బలవంతపు మత మార్పిడీలు ఆపివేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల 1200 మంది అమాయక ఆదివాసులను బలవంతంగా మతమార్పిడి చేయడం నా దృష్టికి వచ్చింది” అని చెప్పారు.

Soyam Bapu Rao: అమాయక ఆదివాసీలను మత మార్పిడి చేయిస్తే…: తెలంగాణ ఎంపీ వార్నింగ్