Mega Family : మళ్లీ బలపడిన మెగా బంధం..! ఆ గొడవలకు చెక్ పడినట్లే అంటూ మురిసిపోతున్న మెగా, అల్లు ఫ్యాన్స్..!

అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్టులే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లైంది.

Mega Family : మళ్లీ బలపడిన మెగా బంధం..! ఆ గొడవలకు చెక్ పడినట్లే అంటూ మురిసిపోతున్న మెగా, అల్లు ఫ్యాన్స్..!

Updated On : December 16, 2024 / 2:00 AM IST

Mega Family : మెగా బంధం మళ్లీ బలపడింది. ఇన్నాళ్లూ ఊరేగిన ఊహాగానాలు బిత్తరపోతున్నాయి. సోషల్ మీడియాలో పేట్రేగిన ప్రచారాలు తలదించుకుంటున్నాయి. మెగా, అల్లు ఫ్యామిలీలో గొడవలు అంటూ గోల చేసిన గొంతులన్నీ చడీచప్పుడు చేయడం లేదు. ఆ మెగా కలయిక ఎన్నో ప్రచారాలను పటాపంచలు చేసింది. ఆ మెగా సన్నివేశం ఆప్యాయతలకు ఆహ్వానం పలుకుతోంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా హీరో ఐక్యమత్యం చూస్తే ఎవ్వరికైనా ముచ్చట వేస్తుంది. ఈ ఫ్యామిలీలో ఏ ఒక్కరికి ఏ చిన్న కష్టం వచ్చినా.. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మేమున్నాం అంటూ కదిలివస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ లో అచ్చం ఇదే జరిగింది. వీరి ఆప్యాయతల ముందు చిన్న చిన్న గొడవలు చిన్నబుచ్చుకున్నాయి.

సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ వార్త వినగానే.. మెగాస్టార్ చిరంజీవి వెంటనే కదిలివచ్చారు. ఆయన భార్య సురేఖ, తమ్ముడు నాగబాబు కూడా అల్లు ఇంటికి చేరిపోయారు. ఇక అల్లు అర్జున్ కూడా తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. వీరంతా హ్యాపీగా ఒకే చోట చేరారు. ఈ సన్నివేశాలను చూసిన మెగా, అల్లు ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఫ్యామిలీ గొడవలకు చెక్ పడినట్లేనని మురిసిపోతున్నారు.

అల్లు అర్జున్ అరెస్ట్ లో ట్విస్టులే కాదు ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపించాయి. అయోమయంలో ఉన్న ఫ్యాన్స్ కి హ్యాపీ ఎండ్ దొరికినట్లైంది. మెగా, అల్లు ఫ్యామిలీ కలయిక ఆత్మీయతలకు, అనుబంధాలకు అర్ధాన్ని చాటి చెప్పింది.

పూర్తి వివరాలు..

Also Read : సంధ్య థియేటర్ ఘటన.. సినీ పరిశ్రమ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ప్రభుత్వం తీసుకోవాల్సింది ఏంటి?