ORR : ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడుగా వెళుతున్నారా..భారీ ఫైన్‌‌ల మోత తప్పదు

ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాలను అతివేగంగా నడిపే వారిపై నిఘా పెట్టనుంది హెచ్‌ఎండీఏ ((HMDA). ఔటర్ రోడ్డుపై ఎక్కిన టైం...దిగిన టైం కౌంట్ చేసి... ఏ మాత్రం తేడా వచ్చినా...

ORR : ఔటర్ రింగ్ రోడ్డుపై స్పీడుగా వెళుతున్నారా..భారీ ఫైన్‌‌ల మోత తప్పదు

Orr Speed

Updated On : December 30, 2021 / 3:31 PM IST

ORR Speed Limit : ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనాలను అతివేగంగా నడిపే వారిపై నిఘా పెట్టనుంది హెచ్‌ఎండీఏ ((HMDA). అంతే కాకుండా వారిపై భారీ ఫైన్‌ల మోత మోగించనుంది. ఓఆర్ఆర్‌ (ORR) పై ఓవర్ స్పీడ్‌ని కంట్రోల్ చేసేందుకు HMDA వినూత్న ప్రయత్నానికి శ్రీ కారం చుట్టబోతుంది. ఈ విధానం ద్వారా ఓఆర్‌ఆర్‌పై వాహనం స్పీడ్‌ను లెక్కేయనుంది. అంతేకాకుండా సమయాని కంటే ముందుగానే ఓఆర్‌ఆర్‌ను దాటితే జరిమానా పడేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాది నుంచి దీనిని అమలు చేయబోతున్నారు.

Read More : China Covid : చైనాలో అమానవీయం..కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు వీధుల్లో నడిపించారు

ఔటర్ రోడ్డుపై ఎక్కిన టైం…దిగిన టైం కౌంట్ చేసి… ఏ మాత్రం తేడా వచ్చినా చర్యలు చేపట్టనుంది హెచ్‌ఎండీఏ. ఆ వాహనాలపై ఫైన్ వేయడానికి అవసరమైన డేటాని పోలీసులకు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఔటర్‌ రింగ్‌రోడ్డుపై అతి వేగానికి బ్రేకులు వేయొచ్చని భావిస్తోంది. మరోవైపు ఓఆర్ఆర్‌పై ప్రమాదాలకు గురైన బాధితులకు సకాలంలో వైద్యం అందించేందుకు 16 ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేశారు.

Read More : Muhammad ali jinnah tower : గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలి : సోము వీర్రాజు

10 ఆధునిక అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు. కార్పొరేట్ వైద్యంలో పేరుగాంచిన యశోదా, అపోలో వంటి ఆసుపత్రులు ట్రామా సెంటర్లలో వైద్య సేవలు అందిస్తున్నాయి. 8 ట్రామా సెంటర్లలో యశోదా హాస్పిటల్‌ వైద్య సేవలు అందిస్తుండగా మరో ఎనిమిది ట్రామా సెంటర్లలో అపోలో వైద్య సేవలు అందిస్తుంది.