Sridhar Babu Duddilla : మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ- సీఎం పదవిపై శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మాది ప్రజాస్వామికమైన పార్టీ. 64మందిలో నేనూ ఒకడిని.

Sridhar Babu Duddilla : మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ- సీఎం పదవిపై శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు

Sridhar Babu Duddilla On CM Post

నేను కూడా సీఎం పదవి రేసులో ఉన్నా అని అంటున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని ఆయన అన్నారు. పార్టీలో గెలిచిన 64మంది కూడా సీఎం అభ్యర్థులే అని కీలక వ్యాఖ్యలు చేశారాయన. ”కాంగ్రెస్ నుంచి గెలిచిన 64 మంది అభ్యర్థులు సీఎం రేసులో ఉన్న వారే. ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మాది ప్రజాస్వామికమైన పార్టీ. 64మందిలో నేనూ ఒకడిని. 64మందిలో ఎవరైనా సీఎం కావొచ్చు. అయితే, సీఎం ఎవరు అన్నది హైకమాండ్ నిర్ణయమే ఫైనల్” అని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

Also Read : పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా.. సీఎం పదవి ఆశించటం తప్పు కాదు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ సీఎం ఎంపిక విషయంలో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి కాబోయే సీఎం ఎవరు? అన్న దానిపై సస్పెన్స్ వీడటం లేదు. పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు సీఎం పదవిని ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. తమకే సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో సీఎం ఎంపిక వ్యవహారం ఆలస్యం అవుతోందని సమాచారం. అయితే, అంతిమంగా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అంతా చెబుతున్నారు.

మరి, హైకమాండ్ ఎవరిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందో చూడాలి. ఏ క్షణంలో ఎలాంటి ప్రకటన వస్తుందోనని కాంగ్రెస్ శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. కాగా, సీఎం రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు సైతం ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్నారు.

Also Read : ఢిల్లీకి రేవంత్.. మరింత ఉత్కంఠ పెంచుతోన్న సీఎం ఎంపిక