DK Aruna House : బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దొంగ, 2గంటలు అక్కడే, ఏం చేశాడో చూడండి..

కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు.

DK Aruna House : బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన దొంగ, 2గంటలు అక్కడే, ఏం చేశాడో చూడండి..

Updated On : March 16, 2025 / 6:46 PM IST

DK Aruna House : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో కలకలం రేగింది. ఓ దొంగ డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డాడు. అతడు దాదాపు 2 గంటల పాటు ఇంట్లోనే గడిపాడు. కిచెన్ రూమ్ లో సీసీ కెమెరా వైర్ ని కట్ చేసిన దుండగుడు.. కాసేపు అక్కడే ఉన్నాడు. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డీకే అరుణ వాచ్ మెన్ ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

తెల్లవారుజామున సమయంలో ఈ ఘటన జరిగింది. కిచెన్ ద్వారా అతడు ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కిచెన్ వైపు ఉన్న గ్లాస్ డోర్ ను బ్రేక్ చేసి ఆగంతకుడు లోనికి చొరబడ్డాడు. సుమారు 2 గంటలు పాటు కిచెన్ లో తచ్చాడుతూ కనిపించాడు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దుండగుడు చొరబడ్డాడు. ఆ సమయంలో శబ్దం వచ్చిందని, కిందకు వచ్చి చేస్తే ఏమీ కనిపించలేదని వాచ్ మెన్ తెలిపాడు.

ఉదయం 6 గంటలకు లేచి చూడగా దుండగుడి కాలి గుర్తులు కనిపించాయన్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఇంట్లో ఉన్న సీసీ కెమెరా చెక్ చేశామని తెలిపాడు. అందులో దుండగుడు కనిపించాడని చెప్పాడు. గుర్తు తెలియని వ్యక్తి కిటికీ ద్వారా ఎంటర్ అయ్యి, సీసీ కెమెరా కేబుల్ కట్ చేసుకుంటే వెళ్లాడని, సుమారు గంటన్నర సేపు ఇంట్లో ఉన్నాడని వెల్లడించాడు.

Also Read : దమ్ముంటే ప్రాజెక్టులపై చర్చకు రండి- కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్

దుండగుడు ఎంపీ ఇంట్లోకి ఎందుకు చొరబడ్డాడు? గంటన్నర సేపు అక్కడే ఎందుకు ఉన్నాడు? సీసీ కెమెరా కేబుల్ వైర్లు ఎందుకు కట్ చేశాడు? అనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దుండుగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడినట్లు పోలీసులు గుర్తించారు.