Student Letter : ఆలేరు మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థిని లేఖ కలకలం

బాలికలను హాస్టల్ సిబ్బంది లైంగికంగా వాడుకుంటున్నట్లు ఆరోపిస్తూ లేఖ రాసింది. సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఇతరుల వద్దకు బలవంతంగా పంపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది.

Student Letter : ఆలేరు మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థిని లేఖ కలకలం

Girl Letter

Updated On : March 20, 2022 / 4:09 PM IST

Aleru Minority Gurukul School : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థిని లేఖ కలకలం సృష్టిస్తోంది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, జిల్లా మైనారిటీ శాఖ అధికారికి విద్యార్థిని లేఖ రాసింది. బాలికలను హాస్టల్ సిబ్బంది లైంగికంగా వాడుకుంటున్నట్లు ఆరోపిస్తూ లేఖ రాసింది.

సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఇతరుల వద్దకు బలవంతంగా పంపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. బాలికలను హాస్టల్ సిబ్బంది లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. మాట వినకపోతే కోడుతున్నారని, అన్నం పెట్టకుండా హింసిస్తున్నారని ఆరోపణ చేశారు.

Head Master raped girl : మాస్కు పెట్టుకోలేదని పిలిచి..విద్యార్ధినిపై హెడ్మాస్టర్ అత్యాచారం

విద్యార్థిని లేఖపై ఆలేరు మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ స్పందించారు. లేఖలోని ఆరోపణలు అవాస్తవమన్నారు. తమ స్కూల్ లో పనిచేసే ఆయా, ఆమె భర్తకు విభేదాలు ఉన్నాయని.. విద్యార్థుల పేరుతో లేఖ రాశారని అనుమానిస్తున్నామని పేర్కొన్నారు.