CMR Engineering College : గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్ లో మొబైల్ తో వీడియోలు? సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత..
దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు.

CMR Engineering College : మేడ్చల్ జిల్లాలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజీ ఎదుట పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కాలేజీలోని గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్ లో మొబైల్ తో వీడియోలు తీశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాలేజీ ముందు ఆందోళనకు దిగారు.
ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ధర్నాకు దిగారు. కాగా, హాస్టల్ లో వంట చేసే సిబ్బందే వీడియోలు తీసి ఉంటారని విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్ లో వీడియోలు తీశారనే వార్తతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు పోలీసులు.
Also Read : వీడెవడండీ బాబూ.. ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు.. వీడియో వైరల్..