Telangana Extends Lockdown : విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కు మొదటి ప్రాధాన్యత వ్యాక్సిన్
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన.

Telangana Vaccination Student
Telangana Vaccination Students : తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కరోనా వైరస్ ను నియంత్రించే విధంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా లాక్ డౌన్ మరో పది రోజుల పాటు పొడిగిస్తూ…నిర్ణయం తీసుకుంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో నిర్ణయం తీసుకుంది.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సినేషన్ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వెల్లడించారాయన. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వ్యాక్సిన్ ఇస్తే వారు సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని, దీనిపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు.
మరోవైపు…లాక్ డౌన్ పొడిగింపు పై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 10వ తేదీ వరకు లాక్ డౌన్ విధించనున్నట్లు వెల్లడించింది. అయితే..సమయాల్లో మార్పులు చేశారు. ముందున్న విధంగా ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు కాకుండా..ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 01 గంట వరకు …ప్రజలు ఇళ్లకు చేరుకొనేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు వెసుబాటు కల్పించింది. తర్వాత..లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.
Read More : Sonu Sood: రిజక్ట్ చేసిన మ్యాగజైన్ కవర్‌పైనే సోనూసూద్ ఫొటో