గ్రూప్-1 రిజల్ట్స్‌కు అడ్డంకులు తొలిగాయ్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..? గ్రూప్-1తోపాటు గ్రూప్-2, 3 ఫలితాలు కూడా

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని దాఖలై పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ..

గ్రూప్-1 రిజల్ట్స్‌కు అడ్డంకులు తొలిగాయ్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే..? గ్రూప్-1తోపాటు గ్రూప్-2, 3 ఫలితాలు కూడా

Telangana group-1 Results

Updated On : February 4, 2025 / 10:11 AM IST

Telangana group-1 Results: తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29ని రద్దు చేయాలని దాఖలై పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈ నెలాఖరులోగా గ్రూప్-1తోసహా గ్రూప్-2, 3 పరీక్షల ఫతాలను కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ సన్నద్ధమవుతుంది. తొలుత గ్రూప్-1 జనరల్ ర్యాకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను విడుదల చేసిన తరువాత రిజర్వేషన్ల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. తర్వాత మార్చి నెలాఖరులోపు రిక్రూట్ మెంట్ ప్రక్రియ మొత్తం పూర్తిచేసే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Telangana Railway: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకోసం కేంద్రం భారీగా నిధులు.. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని కోరుతూ పలువురు గత నెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై సోమవారం జస్టిస్ పామిడి ఘంటమ్ శ్రీ నరసింహా, జస్టిస్ మనోజ్ మిశ్రాలద్వి సభ్య ధర్మాసనం విచారించింది. పిటిషన్ల తరపున సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సోంది, మోహిత్ రావులు తమ వాదనలు వినిపించగా.. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. జీవో 29తో వేలాది మంది విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉందని, జనరల్ కేటగిరీలోని అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారిని అన్ రిజర్వుడ్ గానే పరిగణిస్తుండటం వల్ల దివ్యాంగ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వారికంటే ఎక్కువ మార్కులు వచ్చినా రిజర్వేషన్ కేటగిరీగానే పరిగణించి 1:50 కింద అభ్యర్థులను మెయిన్కు పిలవాలని అభ్యర్థించారు.

Also Read: Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం.. ఆ రెండు అంశాలే ప్రధాన అజెండా

వాదనల అనంతరం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారని, ఈ సమయంలో గ్రూప్-1 అంశంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఫలితాల విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో ఈనెలాఖరులోగా గ్రూప్-1తోపాటు గ్రూప్-2, 3 పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు టీజీపీఎస్పీ సన్నద్ధమవుతుంది. ఈ క్రమంలో తొలుత గ్రూప్-1 జీఆర్ఎల్ రిలీజ్ చేయనుంది. తద్వారా గ్రూప్-1 జీఆర్ఎల్ లోని ర్యాంకులను బట్టి అభ్యర్థులకు ఏయే సర్వీసెస్ లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందో తెలుసుకునే అవకాశం ఉటుంది. దీనికితోడు ఒకవేళ గ్రూప్-1తోపాటు గ్రూప్-2, 3లకు ఎంపికైనా అలాంటి వాళ్లు చివరి రెండింటిని వదులుకుంటారు. దీనివల్ల బ్యాక్ లాగ్ పోస్టులు మిగిలే చాన్స్ ఉండదని అధికారులు భావిస్తున్నారు.