Telangana Railway: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకోసం కేంద్రం భారీగా నిధులు.. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు.

Telangana Railway: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులకోసం కేంద్రం భారీగా నిధులు.. మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన

Union Railway Minister Ashwini Vaishnaw

Updated On : February 4, 2025 / 8:19 AM IST

Union Railway Minister Ashwini Vaishnaw: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయించినట్లు చెప్పారు. తాజా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రైల్వే ప్రాజెక్టులకు మొత్తం రూ.5,337 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోమవారం ఢిల్లీలో రైల్వేశాఖ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. అయితే, తాజా కేటాయింపులు.. యూపీఏ ప్రభుత్వం హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ప్రతీయేటా కేటాయించిన దానికంటే ఆరు రెట్లు ఎక్కువ అని, యూపీఏ హయాంలో ఉమ్మడి ఏపీకి యేటా సగటున రూ.886 కోట్లు మాత్రమే కేటాయించినట్లు చెప్పారు.

Also Read: Telangana Assembly Special Session : తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం.. ఆ రెండు అంశాలే ప్రధాన అజెండా

తెలంగాణలో గత పదేళ్లలో వివిధ రైల్వే ప్రాజెక్టులకు రూ.41,677 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని, అయితే, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి తెలంగాణలో 753 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే ట్రాకులు నిర్మించడం జరిగిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 100శాతం రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని, 453 ప్లై ఓవర్లు, అండర్ బ్రిడ్జిలు నిర్మితమయ్యాయయని చెప్పారు. రాష్ట్రంలో 48 స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించడం జరిగిందని, 62 లిఫ్ట్ లు, 17 ఎస్కలేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

Also Raed: కాంగ్రెస్ సర్కార్‌ అందుకే వ్యూహం మార్చుకుందా? ఈ విషయంలో ఏం చేయబోతుంది?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఏడు జిల్లాల మీదుగా ఐదు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపిన మంత్రి.. తెలంగాణలో ప్రధానమైన సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు రూ.1,042 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో రూ.715 కోట్లతో సికింద్రాబాద్, రూ. 327 కోట్లతో హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ప్రోగ్రస్ లో ఉన్నాయని చెప్పారు. 2024 నుంచి ఆరేళ్లలో దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే నెట్ వర్క్ కు పూర్తిస్థాయిలో కవచ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నామని, ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కవచ్ ను 1,326 కిలో మీటర్లు మార్గంలో ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటి వరకు 1,011 కిలో మీటర్ల మేర పనులు పురోగతిలో ఉన్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. సికింద్రాబాద్ కేంద్రంగా కవచ్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Also Read: కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతున్న వరుస ఇష్యూస్.. ఇది హస్తం పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తూ..

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రూ.39,300 కోట్ల వ్యయంతో 2,529 కిలో మీటర్ల పొడవైన 22 కొత్త ట్రైన్ ట్రాక్ పనులు కొనసాగుతున్నాయని, 40 అమృత్ స్టేషన్లను రూ.1,992 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇదిలాఉంటే.. కేంద్ర బడ్జెట్ లో రైల్వకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు రూ. 9,417 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.