Tamilisai Soundararajan: ఇంత ఇరుకుగా ఉన్న ఈ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తోన్న మీకు అభినందనలు: తమిళిసై చురకలు
ఇప్పుడు కూడా ఒకే పడకపై ముగ్గురు పిల్లలు ఉన్న దృశ్యాలను తాను చూశానని, ఇది చాలా బాధాకరమని తెలిపారు.

Governor Tamilisai
Tamilisai Soundararajan – Osmania Hospital: తెలంగాణ గవర్నర్ (Telangana Governor) తమిళిసై సౌందర రాజన్ ఇవాళ హైదరాబాద్(Hyderabad)లోని ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి, వైద్య సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి పలు వివరాలు తీసుకున్నారు.
అనంతరం తమిళిసై సౌందర్య రాజన్ మాట్లాడుతూ.. ఇంత ఇరుకుగా ఉన్న ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తోన్న వైద్యులు, సిబ్బందికి అభినందనలని చురకలంటించారు. తాను 2019లో గవర్నర్ అయ్యాక తనను ఓజీహెచ్ వైద్యులు కలిశారని, ఆసుపత్రి భవనం విస్తరించాలని కోరారని చెప్పారు.
రోగులకు బెడ్లు సరిపోవడం లేదని అనేక సార్లు ప్రభుత్వానికి చెప్పామని సౌందర రాజన్ అన్నారు. అంతేగాక, టాయిలెట్లకు సరైన డోర్లు కూడా లేకపోవడం బాధాకరమని చెప్పారు. కొత్త భవనం నిర్మాణానికి ఏవైనా చట్టపరమైన సమస్యలు ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని అన్నారు.
భారీగా పెరిగిన రోగులతో ఆసుపత్రి నిండిపోతోందని, పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా మారాయని సౌందర రాజన్ చెప్పారు. అటెండర్లకు కూడా ఉండేందుకు సరైన స్థలం లేదని అన్నారు. ఇది దశాబ్దాల క్రితం నిర్మించిన భవనమని చెప్పారు. రోగులకి అందించే సేవల విషయంలో రాజీపడకూడదని చెప్పారు. ఇప్పుడు కూడా ఒకే పడకపై ముగ్గురు పిల్లలు ఉన్న దృశ్యాలను తాను చూశానని, ఇది చాలా బాధాకరమని తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందలి అన్నదే తన లక్ష్యమని చెప్పారు.
K Keshava Rao : భవిష్యత్తు ప్రాంతీయ పార్టీలదే, రాహుల్‌కు నాయకత్వ లక్షణాలు లేవు- కేకే