Tamilisai : భద్రాద్రికి గవర్నర్ తమిళిసై

ఓ వైపు ప్రభుత్వంతో విభేదాలు, మరోవైపు అధికారులు ప్రోటోకాల్‌ పాటించకపోయినప్పటికీ తన పర్యటనలు మాత్రం ఆపడం లేదు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో...

Tamilisai : భద్రాద్రికి గవర్నర్ తమిళిసై

Tamilisai

Updated On : April 11, 2022 / 7:51 AM IST

Tamilisai To Visit Bhadradri : ఓ వైపు ప్రభుత్వంతో విభేదాలు, మరోవైపు అధికారులు ప్రోటోకాల్‌ పాటించకపోయినప్పటికీ తన పర్యటనలు మాత్రం ఆపడం లేదు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. ఇప్పటికే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పర్యటించి చెంచులతో సమావేశమైన ఆమె.. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు ఆ జిల్లాలో పర్యటించనున్నారు. గిరిజన ప్రాంతాలను సందర్శించడంతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు గవర్నర్‌. మారుమూల గిరిజన ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఆదిమ గిరిజన సమూహాలకు చెందిన ప్రజల పోషకాహార స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పైలట్‌ ప్రాజెక్టును గవర్నర్‌ ప్రారంభిస్తారు.

Read More : Tamilisai : నేను ఏది మాట్లాడిన తెలంగాణ ప్రజల కోసమే.. అమిత్ షాతో ముగిసిన గవర్నర్ తమిళిసై భేటీ

2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం ఉదయం భద్రాచలం దేవస్థానంలో జరిగే సీతారామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్‌ తమిళిసై హాజరవుతారు. ఆ తర్వాత భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే గిరిజన మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు వెళ్తారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధిని గవర్నర్‌ సందర్శించి దాని పనితీరును సమీక్షిస్తారు. ఆ తరువాత దమ్మాయిపేట మండలం నాచారం గ్రామం జగదాంబ సహిత జయలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం పూసుకుంట కొండరెడ్డి గిరిజన ఆవాసాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌ను గవర్నర్‌ తమిళిసై సందర్శిస్తారు.

Read More : TS Governor Tamili : ‘తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు’..

ఇటీవలే గవర్నర్ తమిళిసై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, బడ్జెట్ సమావేశాల పరిణామాలను ఆయనకు వివరించారు. ప్రభుత్వం కావాలనే తనను అవమానిస్తోందని, ప్రభుత్వ చర్యలు తనను ఏ మాత్రం ఆపలేవని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానం క్లియర్ చేయకపోవడం దగ్గరి నుంచి.. ఉగాది వేడుకల వరకు జరిగిన అన్ని విషయాలపై తన స్టాండ్ ఏంటో చెప్పేశారు. ప్రభుత్వం పంపించిన వాటిల్లో కొన్నింటిని ఆమోదించకపోతే.. రాజ్ భవన్ ను, గవర్నర్ ను అవమానిస్తారా ? అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు.