రోడ్డుపై ఇబ్బందిపడుతున్న రైతన్నకు సహాయం చేసిన ఏఎస్ఐ.. వీడియో వైరల్.. నెటిజన్ల ప్రశంసలు
తాండూరు ప్రాంతంలో ఓ రైతు ఎండ్లపై సామాన్లు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బండి చక్రం ఊడిపడిపోయింది. దానిని బండికి తిరిగి అమర్చేందుకు

policeman helped
Police Man Helped : ఏఎస్ఐ మానత్వం చాటుకున్నాడు. రోడ్డుపై బండి చక్రంఊడి ఇబ్బంది పడుతున్న రైతులను గమనించి వారి వద్దకు వెళ్లి సహాయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఏఎస్ఐపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తాండూరు ప్రాంతంలో ఓ రైతు ఎండ్ల బండిపై సామాన్లు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో బండి చక్రం ఊడిపడిపోయింది. దానిని బండికి తిరిగి అమర్చేందుకు రైతు, అతనివెంటఉన్న మహిళ ప్రయత్నించినప్పటికీ వారి వల్లకాలేదు. సహాయం చేయమని రోడ్డుపై వెళ్తున్న వారిని కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. అదే సమయంలో అటువైపు కారులో వెళ్తున్న తాండూరు పీఎస్ లో పనిచేస్తున్న ఏఎస్ఐ గోపాల్ రైతుల ఇబ్బందిని గమనించారు. వెంటనే కారు రోడ్డుపక్కకు ఆపి రైతు వద్దకు వెళ్లాడు.
Also Read : ఎర్రబెల్లి దయాకర్, పల్లా రాజేశ్వర్‌కు కడియం శ్రీహరి స్ట్రాంట్ కౌంటర్
రైతు వద్దకు వెళ్లిన ఏఎస్ఐ ఎలా జరిగింది, ఏమైనా వాహనాలు ఢీకొనడం వల్ల ఇలా జరిగిందా అని రైతును ప్రశ్నించాడు. అలాంటిదేమీ లేదు, బండి వెళ్తుండగా చక్రం ఊడిపోయిందని రైతు సమాధానం ఇచ్చాడు. రోడ్డుపై వారిని సహాయం అడిగినా ఎవరూ రాలేదని చెప్పాడు. దీంతో ఏఎస్ఐ గోపాల్ రైతుకు సహాయం అందించాడు. బండిని పైకిలేపి చక్రాన్ని అమర్చాడు. దీంతో సదరు రైతు ఏఎస్ఐకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు రైతుకు సహాయం అందించిన ఏఎస్ఐను ప్రశంసిస్తున్నారు.
Also Read : తెలంగాణలో వలసల రాజకీయం.. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తేనే ఆత్మగౌరవం ఉన్నట్లా?
రైతన్నకు సహాయం చేసిన పోలీసన్న
తాండూరులో ఎడ్ల బండిపై వెళుతున్న రైతు బండి చక్రం ఊడిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు.
అప్పుడే అటుగా వెళుతున్న తాండూరు పీఎస్‌లో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోపాల్ తన కారు పక్కన ఆపి ఎడ్ల బండి చక్రాన్ని సరిచేసి రైతుకు సహాయాన్ని అందించారు. pic.twitter.com/xDyS2gB4Vt
— Telugu Scribe (@TeluguScribe) April 2, 2024