Mallu Swarajyam Passed Away : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

నిజాం కాలంలో రజాకార్లను ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి నుంచి శాసన సభకు మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్య వహించారు. 

Mallu Swarajyam Passed Away : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

Mallu Swarajyam (1)

Updated On : March 19, 2022 / 8:54 PM IST

Mallu Swarajyam passed away : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. నిజాం కాలంలో రజాకార్లను ఎదురించిన ధీశాలి మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నుంచి శాసన సభకు ప్రాతినిధ్య వహించారు.

సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో భీమిరెడ్డి రామిరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1931లో మల్లు స్వరాజ్యం జన్మించారు. 1978, 1983లో సీపీఎం తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 1945- 46 వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947- 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్ ,వరంగల్, కరీంనగర్ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.

CPI (M) State Congress : ఘనంగా ప్రారంభమైన CPI(M) తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు

మహిళ కమాండర్ గా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. మల్లు స్వరాజ్యం భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. మల్లు స్వరాజ్యం సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి.. అప్పటి మిర్యాలగూడ పార్లమెంటు నుండి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుండి 83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుండి 84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీపీఎం పార్టీ తరఫున పనిచేశారు. మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు.