Telangana Assembly Election 2023: గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేసి ఓటు వేసిన పొన్నం ప్రభాకర్..

గ్యాస్ సిలిండర్ కి కరెన్సీ నోటు కట్టి దానికి పూజలు చేసి.. ఓటు వేశారు కాంగ్రెెస్ నేత పొన్నం ప్రభాకర్ ..దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో ఎన్నో సిత్రాలు..విచిత్రాలు చోటుచేసుకున్నాయి.

Telangana Assembly Election 2023: గ్యాస్ సిలిండర్‌కు పూజలు చేసి ఓటు వేసిన పొన్నం ప్రభాకర్..

Ponnam Prabhakar, Gas-Cylender

Updated On : November 30, 2023 / 1:51 PM IST

Ponnam Prabhakar : రాజకీయ రంగమైనా, సినిమా రంగమైన ఏదైనా సరే సెంటిమెంట్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు నామినేషన్ వేసే సమయంలో మంచి శకునం చూసుకుని.. మంచి ముహూర్తం పెట్టుకుని మరీ నామినేషన్ వేస్తారు. తమకు గెలిపించాలని దేవాలయాలకు వెళ్లి ప్రార్ధనలు చేస్తారు. ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు కూడా శకునం చూసుకుని వెళ్లే నేతలు చాలామంది ఉన్నారు. దీంట్లో భాగంగా తెలంగాణలో గెలుపే లక్ష్యంగా.. బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా బరిలోకి దిగిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శుభసూచకంగా ఓటు వేయటానికి వెళ్లే ముందు గోపూజ చేసి ఓటు వేశారు. తన భార్యతో కలిసి గోపూజ చేసి కొడంగల్ లో ఓటు వేశారు.

అలాగే మరో కాంగ్రెస్ నేత, హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన తల్లి కాళ్లకు నమస్కారం చేసుకుని వెళ్లి ఓటు వేశారు. ఈక్రమంలో పొన్నం తన నివాసంలో  వంట గ్యాస్ సిలిండర్ కు పూల దండ వేసి దానికి రూ.500ల నోటు పెట్టి దణ్ణం పెట్టారు. ఆయనతో పాటు ఆయన నివాసంలో పలువురు మహిళలతో కూడా గ్యాస్ సిలిండర్ కు దణ్ణం పెట్టించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలో భాగంగా రూ.500లకే గ్యాస్ సిలిండ్ ఇస్తామని మహిళలకు హామీ ఇచ్చింది. దీనికి సింబాలిక్ గా కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గ్యాస్ సిలిండర్ కు మొక్కారు.

Also Read : తెలంగాణ ఎన్నికల్లో వింత డిమాండ్లతో నేతలకు చుక్కలు చూపిస్తున్న ఓటర్లు.. వింటే షాక్ అవ్వాల్సిందే..!

కాగా.. పొన్నం హుస్నాబాద్ లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.