Telangana Assembly Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 72గంటల్లో ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల

5 రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లపై తుది సమీక్ష నిర్వహించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్, ఫలితాల తేదీలపైన ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. Telangana Assembly Election

Telangana Assembly Election : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 72గంటల్లో ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల

Telangana Assembly Election 2023

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. వచ్చే 72 గంటల్లో ఎప్పుడైనా ఎన్నికల నగారాను మోగించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. హైదరాబాద్ లో పర్యటించి వెళ్లిన కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీ కమిషనర్లు ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు సీఈసీ సమాయత్తమైంది. నవంబర్ చివరి లేదా డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.

ఏ క్షణంలోనైనా ఎన్నికల నగారా..
తెలంగాణ శాసనసభ ఎన్నికల నగారా ఏ క్షణంలో అయినా మోగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తన బృందంతో ఇప్పటికే మూడు రోజుల పాటు హైదరాబాద్ లో పర్యటించి సమీక్షలు నిర్వహించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

Also Read : అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ తర్జనభర్జన.. టికెట్ల ప్రకటన ఎప్పుడు?

మరోవైపు తెలంగాణతో పాటు ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపైనా చర్చలు జరిపింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లపై తుది సమీక్ష నిర్వహించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్, నోటిఫికేషన్, పోలింగ్, ఫలితాల తేదీలపైన ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.

డిసెంబర్ మొదటి వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి..
ఇక, తెలంగాణ సహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు నవంబర్ చివరి వారం నుంచి మొదలు పెట్టి డిసెంబర్ మొదటి వారంలోగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించుకుంది ఈసీ. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

Also Read : ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ వ్యాఖ్యల్లో నిజమెంత.. డబ్బు, మద్యం చేరాల్సిన చోటుకు చేరిపోయాయా?

నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్..
ఈ నెల 15వ తేదీలోపు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు ఢిల్లీవర్గాలు చెబుతున్నాయి. ముందుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం ఎన్నికలు జరగనుండగా చివరలో ఒకదశలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణలోశాసనసభ ఎన్నికల పోలింగ్ నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉంది.