Telangana Assembly Election 2023 : తెలంగాణలో సమీపిస్తున్న పోలింగ్ పర్వం.. హోరెత్తిన అగ్రనేతల ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలోకి దిగారు....

Telangana Assembly Election 2023 : తెలంగాణలో సమీపిస్తున్న పోలింగ్ పర్వం.. హోరెత్తిన అగ్రనేతల ప్రచారం

campaigning of top leaders

Updated On : November 21, 2023 / 1:40 PM IST

Telangana Assembly Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థుల ప్రచారం ముమ్మరమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారరంగంలోకి దిగారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ బహిరంగ సభలు, రోడ్ షోలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని పరేడ్ మైదానంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బహిరంగసభ జరగనుంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ నరేంద్రమోదీలు హైదరాబాద్ నగరంలో జరగనున్న రోడ్ షోలలో పాల్గొననున్నారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు. రాహుల్, ప్రియాంకగాంధీలు నగరంలో రోడ్ షోలలో పాల్గొననున్నారు.

వివిధ రాజకీయ పక్షాలకు చెందిన మోదీ, అమిత్ షా, కేసీఆర్, రాహుల్ బహిరంగసభలు, రోడ్ షోలలో జనం కదం తొక్కుతున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ అవస్థలు పెరిగాయి. హైదరాబాద్ నగరంలోని బస్తీలు, మురికివాడల్లోనూ అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. నగరంలోని బస్తీలు, మురికి వాడల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంటున్నందున ఆయా ప్రాంతాల్లో ప్రచారానికి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రాధాన్యమిస్తున్నారు. కులసంఘాలతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థులు ఓట్ల వేట సాగిస్తున్నారు. ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పోలింగ్ వ్యూహాలపై దృష్టి సారించారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : రాజకీయ నేతల ర్యాష్ డ్రైవింగ్.. పెండింగులో ట్రాఫిక్ చలానాలు

ఇప్పటికే అన్ని పార్టీల కార్యకర్తలు ఇంటింటికి వచ్చి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. మరో వైపు ఓటర్ల ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి తమకే ఓటు వేయాలని కాల్ సెంటరు ద్వారా కోరుతున్నారు. మరో వైపు ఓటర్ల జన్మదినోత్సవాల సందర్భంగా కాల్ సెంటరు నుంచి శుభాకాంక్షలు చెబుతూ మెసేజులు కూడా పంపిస్తున్నారు. ఓటరు దేవుడి కరుణ కోసం అభ్యర్థులు నానా పాట్లు పడుతున్నారు.

ALSO READ : Telangana Assembly Election 2023 : కాంగ్రెస్ కట్టడికి బీఆర్ఎస్ మునుగోడు ఫార్ములా?