Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం .. పచ్చని వాతావరణంలో ఓట్ల పండుగ

తెలంగాణ ఎన్నికల్లో ఈసీ ఏర్పాటు చేసి ఎకో ఫ్రెండ్లీగా పోలింగ్ కేంద్రం ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. పచ్చని వాతావరణంలో ఓట్ల పండుగ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతోంది.

Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం .. పచ్చని వాతావరణంలో ఓట్ల పండుగ

Eco friendly Polling center Jagityala

Eco friendly Polling center  In Jagityala : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. 119 నియోజకవర్గాలకు ఒకే దేశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని సెలెబ్రిటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అంతేకాదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ట్రాన్స్‭జెండర్లు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మేం ఓటేశాం.. మరి మీరు? అంటూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా 119నియోజక వర్గాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో జగిత్యాల జిల్లాలో ఉన్నఓ పోలింగ్ కేంద్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. జగిత్యాల జిల్లాలో ఈకో ఫ్రెండ్సీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొబ్బరి ఆకులతో ద్వారాలు రూపొందించి పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లకు స్వాగతం పలుకుతున్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ఇది అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ కేంద్రంలో ఓటు వేసిన ఓటర్లు ప్రత్యేక అనుభూతిని ఆస్వాదిస్తున్నారు.

ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రంలో పనిచేసే సిబ్బంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నా విభిన్నంగా ఉండేవే ఆకట్టుకుంటాయని ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రం నిరూపిస్తోంది. బయట చల్లని వాతావరణం ఈ పోలింగ్ కేంద్రంలో ఆకుపచ్చని తివాచి పరిచినట్లుగా ఉండే ఈ విభిన్న వాతావరణం చక్కటి అనుభూతినిస్తోంది. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రంపై..

అలాగే..దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కామారెడ్డి నియోజకవర్గం పోలింగ్  కేంద్రం కూడా ఆకట్టుకుంటోంది. 266 పోలింగ్ కేంద్రాలున్న కామారెడ్డి నియోజకవర్గంలో 35 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఈసీ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 4000 మంది పోలీసులను మోహరించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ నియోజకవర్గం నుండి సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డి బరిలో ఉండటం ఓ విశేషమైతే..ఇక ఇక్కడి పోలింగ్ కేంద్రాలు కల్యాణ మండపాలను తలపించటం మరో విశేషంగా మారి అదరినీ ఆకట్టుకుంటున్నాయి. కామారెడ్డిలో 40 ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెళ్లి మండపాలను తలపిస్తున్న ఈ పోలింగ్ కేంద్రాల్లో మహిళలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎలక్షన్ అధికారులు కూడా మహిళలే ఉంటారు. ఈ కేంద్రాలను చూస్తుంటే ఓటు వేయడానికి వెళ్తున్నామా? పెళ్లికి వెళ్తున్నామా? అన్న సందేహం కలగకమానదు.