BRS Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. 78మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

అనేక సమీకరణాలు, కూడికలు, తీసివేతల తర్వాత సిట్టింగ్ లకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది. BRS MLA Candidates List

BRS Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. 78మందితో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

BRS Candidates First List

BRS MLA Candidates : తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటంతో పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా దిశగా కసరత్తు చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అందరికన్నా ముందుగా ఈ నెల 16న లేదా 17న అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది.

అలాగే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ పార్టీల్లో కూడా తొలి జాబితా సిద్ధమైంది. దీనికి సంబంధించిన వివరాలను 10టీవీ ఎక్స్ క్లూజివ్ గా అందించింది. బీఆర్ఎస్ తొలి జాబితాలో 78మంది పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయబోయే అభర్థులతో కూడిన జాబితాను 10టీవీ సంపాదించింది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ 10టీవీ దగ్గర ఎక్స్ క్లూజివ్ గా ఉంది. అనేక సమీకరణాలు, కూడికలు, తీసివేతల తర్వాత సిట్టింగ్ లకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి అవకాశం ఇచ్చారని సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా స్పష్టమవుతోంది.

Also Read..Kodangal Constituency: కొడంగల్‌లో రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా.. నరేందర్ రెడ్డే మళ్లీ సత్తా చాటతారా?

కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేందుకు సిద్ధపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్. దాదాపు క్లియర్ అయిన 78 నియోజకవర్గాల అభ్యర్థుల లిస్ట్ ఈ విధంగా ఉంది. బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ లో ఫైనల్ అయిన అభ్యర్థుల జాబితాను 10టీవీ సంపాదించింది. ఆ జాబితాలో ఉన్న లీడర్లు ఎవరు? కొత్త వాళ్లకు ఎక్కడ ఛాన్స్ ఇచ్చారు? మళ్లీ ఛాన్స్ దక్కించుకున్న సిట్టింగ్ లు ఎవరు? ఏ జిల్లాలో ఎవరెవరికి పోటీ చేసే అవకాశం దక్కింది? బీఆర్ఎస్ నుంచి బరిలో నిలవబోతున్న అభ్యర్థుల పేర్లను 10టీవీ ఎక్స్ క్లూజివ్ గా అందించింది. చివరి నిమిషంలో ఒకటి రెండు మార్పులు జరిగితే తప్ప దాదాపుగా ఇదే జాబితా ఖరారు కాబోతోంది. ఈ నెల 16 లేదా 17 తేదీన బీఆర్ఎస్ తొలి జాబితా రిలీజ్ కాబోతోంది.

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన చూస్తే..

ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి ఖరారైన అభ్యర్థులు..
10 అసెంబ్లీ స్థానాలకు ఏడుగురు అభ్యర్థులు ఖరారు..

1 సిర్పూర్- కోనేరు కోనప్ప(సిట్టింగ్ ఎమ్మెల్యే)
2 చెన్నూరు(ఎస్సీ రిజర్వ్డ్)- బాల్క సుమన్(సిట్టింగ్ ఎమ్మెల్యే)
3 ఆసిఫాబాద్- ఆత్రం సక్కు
4 ఆదిలాబాద్- జోగు రామన్న
5 బోథ్- బాపురావ్ రాథోడ్
6 నిర్మల్- ఇంద్రకరణ్ రెడ్డి(సిట్టింగ్ ఎమ్మెల్యే)
7 ముథోల్ – గడ్డిగారి విఠల్ రెడ్డి(సిట్టింగ్ ఎమ్మెల్యే)

ఉమ్మడి నిజామాబాద్‌ – 9 స్థానాలకు 8మంది ఖరారు

8 ఆర్మూర్‌  – ఆశన్నగారి జీవన్‌ రెడ్డి
9 బోధన్‌  – షకీల్‌ అహ్మద్‌
10 జుక్కల్‌ – హన్మంత్‌ షిండే
11 బాన్సువాడ – పోచారం శ్రీనివాసరెడ్డి
12 ఎల్లారెడ్డి – జాజుల సురేందర్‌
13 నిజామాబాద్‌ అర్బన్‌ – గణేశ్‌ బిగాల
14 నిజామాబాద్‌ రూరల్‌ – బాజిరెడ్డి గోవర్ధన్‌
15 బాల్కొండ – వేముల ప్రశాంత్‌ రెడ్డి

Also Read..BJP Candidates First List : తెలంగాణలో ఎన్నికల కోలాహలం.. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

కరీంనగర్‌ – 13 స్థానాలకు 8మంది ఖరారు

16 కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు/ కల్వకుంట్ల సంజయ్‌
17 జగిత్యాల – ఎం. సంజయ్‌ కుమార్‌
18 మంథని  – పుట్టా మధు ( జెడ్పీ చైర్మన్‌ )
19 కరీంనగర్‌ – గంగుల కమలాకర్‌
20 సిరిసిల్ల – కల్వకుంట్ల తారక రామారావు
21 మానకొండూర్‌ – బాలకిషన్‌ రసమయి
22 హుస్నాబాద్‌ – సతీశ్‌ కుమార్‌ వొడితెల
23 రామగుండం – కోరుకంటి చందర్‌

మెదక్‌ – 6/10

24 సిద్దిపేట్‌ – తన్నీరు హరీశ్‌ రావు
25 నారాయణ్‌ఖేడ్‌ – మహారెడ్డి భూపాల్‌ రెడ్డి
26 నర్సాపూర్‌ – చిలుముల మదన్‌ రెడ్డి
27 పటాన్‌చెరు గూడెం  – మహిపాల్‌ రెడ్డి
28 దుబ్బాక – కొత్త ప్రభాకర్‌ రెడ్డి
29 గజ్వేల్‌  – కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు

రంగారెడ్డి- 12/14

29 మేడ్చల్‌  – సీహెచ్‌. మల్లారెడ్డి
30 మల్కాజ్‌గిరి – మైనంపల్లి హన్మంతరావు
31 కుత్బుల్లాపూర్‌ – కే.పీ. వివేకానంద్‌
32 కూకట్‌పల్లి – మాధవరం కృష్ణారావు
33 ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి
34 లాల్‌ బహదూర్‌ నగర్‌ – దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డి
35 మహేశ్వరం – పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి
36 రాజేంద్రనగర్‌ – తొలకంటి ప్రకాశ్‌ గౌడ్‌
37 శేరిలింగంపల్లి – అరికెపూడి గాంధీ
38 చేవెళ్ల – కాలె యాదయ్య
39 వికారాబాద్‌ – డాక్టర్‌ ఆనంద్‌ మెతుకు
40 తాండూర్‌ – పైలట్‌ రోహిత్‌ రెడ్డి

హైదరాబాద్‌ -6/ 15

41 ముషీరాబాద్‌ – ముఠా గోపాల్
42 అంబర్‌పేట్‌ – కాలేరు వెంకటేశం
43 ఖైరతాబాద్‌ –  దానం నాగేందర్‌
44 జుబ్లీహిల్స్‌ – మాగంటి గోపీనాథ్‌
45 సనత్‌ నగర్‌ – తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
46 సికింద్రాబాద్‌ – టి. పద్మారావ్

Also Read..Congress Candidates First List : కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం, 10టీవీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

మహబూబ్‌నగర్‌ – 10/14

48 కొడంగల్‌ – పట్నం నరేందర్‌ రెడ్డి
49 నారాయణ్‌పేట్‌ – ఎస్‌. రాజేందర్‌ రెడ్డి
50 మహబూబ్‌ నగర్‌ – వి. శ్రీనివాస్‌ గౌడ్‌
51 జడ్చర్ల – సి. లక్ష్మా రెడ్డి
52 దేవరకద్ర – ఆల వెంటేశ్వర్‌ రెడ్డి
53 మక్తల్‌ – చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి
54 వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి
55 గద్వాల్‌ – బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి
56 నాగర్‌ కర్నూల్‌ – మర్రి జనార్ధన్‌ రెడ్డి
57 కొల్లాపూర్‌ – బీరం హర్షవర్ధన్‌ రెడ్డి

నల్గొండ -10/12

58 దేవరకొండ – రమావత్‌ రవీంద్ర కుమార్‌
59 మిర్యాలగూడ – నల్లమోతు భాస్కర్‌ రావు
60 హుజూర్‌నగర్‌ – సైదిరెడ్డి
61 సూర్యాపేట్‌ – గుంతకండ్ల జగదీశ్‌ రెడ్డి
62 నల్గొండ – కంచర్ల భూపాల్‌ రెడ్డి
63 భువనగిరి – పైలా శేఖర్‌ రెడ్డి
64 నకిరేకల్‌ – చిరుమర్తి లింగయ్య
65 తుంగతుర్తి – గడారి కిశోర్‌ కుమార్‌
66 ఆలేరు – గొంగడి సునీత
67 మునుగోడు – కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి

వరంగల్‌ -6/12

68 పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్‌రావు
69 నర్సంపేట్‌ – పెద్ది సుదర్శన్‌ రెడ్డి
70 పరకాల – చల్లా ధర్మారెడ్డి
71 వరంగల్‌ పశ్చిమం – దాస్యం వినయ్‌ భాస్కర్‌
72 వర్ధన్‌నపేట – ఆరూరి రమేశ్‌
73 భూపాలపల్లి – గండ్ర వెంకటరమణారెడ్డి

ఖమ్మం -5/10

74 పినపాక – రేగా కాంతారావ్‌
75 ఇల్లందు – బానోత్‌ హరిప్రియ
76 ఖమ్మం – పువ్వాడ అజయ్‌ కుమార్‌
77 సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య
78 అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వరరావు

Also Read..Telangana Congress: ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే ఈ ప్రయోగం ఎందుకు.. సూర్యం అంగీకరిస్తారా?