Telangana Banks : బ్యాంకులకు వెళుతున్నారా, పని వేళలు మారాయి..తెలుసుకోండి
బ్యాంకుల పని వేళలను కుదించారు. 2021, మే 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి.

Telangana Banks
Banks Working Hours Changed : బ్యాంకులకు వెళుతున్నారా ? అయితే..పని వేళలు మారాయని తెలుసుకోండి. కరోనా సంక్షోభం అన్ని రంగాలను పట్టి పీడిస్తోంది. ఈ రంగం..ఆ రంగం అని కాదు..అందరూ ఈ వైరస్ కారణంగా అష్టకష్టాలు పడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో..తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు.
2021, మే 12వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉదయం 10 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 06 గంటల వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించించింది. ఇది ప్రకటించిన కొద్ది గంటల్లోనే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
బ్యాంకుల పని వేళలను కుదించారు. 2021, మే 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. 20వ తేదీ వరకు ఈ సమయాలే కంటిన్యూ కానున్నాయి. అంతేగాదు..బ్యాంకుల్లో పనిచేసే సిబ్బంది 50 శాతం వరకు మాత్రమే ఉండనున్నారు.
మరోవైపు.. రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో 4 వేల 723 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఒక్కరోజులో 31 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 59 వేల 133 యాక్టివ్ కేసులున్నాయని, 2 వేల 834 మంది చనిపోయారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 745 కరోనా కేసులు రికార్డయ్యాయి.
Read More : అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో ఆవు పేడ కేకులు.. పట్టుకున్న అధికారులు