BJP Leaders : వరద ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ నేతలు.. 8 ఉమ్మడి జిల్లాలకు ఎనిమిది బృందాలు

జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.

BJP Leaders : వరద ప్రాంతాల్లో పర్యటించనున్న బీజేపీ నేతలు.. 8 ఉమ్మడి జిల్లాలకు ఎనిమిది బృందాలు

BJP leaders (1)

Updated On : July 28, 2023 / 9:17 PM IST

Telangana Flood Affected Areas : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. ఈ నేపథ్యంలో వరద ప్రాంతాల పర్యటనకు బీజేపీ సిద్ధమైంది. జులై30, 31, ఆగస్టు1వ తేదీల్లో బీజేపీ నేతలు జిల్లాల బాటపట్టనున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

వర్షం అత్యధికంగా కురిసిన 8 ఉమ్మడి జిల్లాలకు ఎనిమిది బృందాలు వెళ్లనున్నాయి. జులై 30వ తేదీన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనుంది. బండి సంజయ్ బృందం నేతృత్వంలోని బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది.

Kishan Reddy: బీజేపీ గురించి విజయశాంతి చేస్తున్న ట్వీట్లను నేను..: కిషన్ రెడ్డి

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనుంది. పొంగులేటి సుధాకర్ నేతృత్వంలోని బృందం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనుంది. డీకే అరుణ నేతృత్వంలోని బృందం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనుంది.

ఈటల రాజేందర్ నేతృత్వంలోని బృందం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనుంది. జితేందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటించనుంది. డాక్టర్ లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం గ్రేటర్ హైదరాబాద్ లో పర్యటించనుంది.