Telangana BJP : ఈ రాత్రికి బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్..!
వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ లిస్ట్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. BJP First List

Telangana BJP First List
Telangana BJP First List : ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చిస్తోంది. జేపీ నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇతర సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ రాత్రికి తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : అసెంబ్లీ బరిలోకి దిగమంటున్న బీజేపీ సీనియర్లు.. వారిద్దరికి మినహాయింపు!
తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో అనుసరించాల్సిన వ్యూహాలపై డిస్కస్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు గుర్రాల ఎంపిక, సీఎం అభ్యర్థి, ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలపైనా చర్చిస్తున్నారు. మూడు రోజులుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ రాత్రికి బీజేపీ హైకమాండ్ ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించనుందని తెలుస్తోంది. వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఫస్ట్ లిస్ట్ విడుదలపై సస్పెన్స్ కొనసాగుతుండగా.. బీజేపీ ఆశావహుల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది.